Best 6 OTT Movies To Watch This Weekend: వారమంతా పనులతో అలసిపోయిన జనాలకు శని, ఆదివారాలు వస్తే చాలు కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. బయట తిరగడం కంటే ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు.
చూడాల్సిన ది బెస్ట్ 6 ఓటీటీ సినిమాలు

డిజిటల్ మీడియా విప్లవం పెరిగిన తర్వాత ప్రతి వారం ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వీకెండ్‌లో మీ మూడ్‌కు తగ్గట్టుగా యాక్షన్, కామెడీ, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ది బెస్ట్ 6 సినిమాలపై లుక్కేద్దాం.
సూపర్ సుబ్బు (నెట్‌ఫ్లిక్స్):
తెలుగు ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించడానికి వచ్చిన సరికొత్త కామెడీ డ్రామా ఓటీటీ సిరీస్ 'సూపర్ సుబ్బు'. ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సిరీస్ కథ అంతా ఒక పల్లెటూరి చుట్టూ తిరుగుతుంది.
దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సుబ్బు అనే యువకుడి జీవితం, అతను అనుకోకుండా ఆ ఊరిలో సెక్స్ ఎడ్యుకేటర్‌గా మారిన తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ. బోల్డ్ అండ్ ఫన్నీ ఎలిమెంట్స్‌తో ఈ ఓటీటీ సిరీస్ నవ్వులు పూయిస్తోంది.
బాహుబలి ది టార్చ్ బేరర్ (నెట్‌ఫ్లిక్స్):
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన 'బాహుబలి' సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజన్‌ను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన డాక్యూసిరీస్ ఇది. 8.9 అత్యుత్తమ ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో ఉంది. సినిమా నిర్మాణ రంగంలో ఆసక్తి ఉన్నవారితో పాటు, సాధారణ సినిమా అభిమానులు కూడా తప్పక చూడాల్సిన సిరీస్ ఇది.
గ్యారహ్ గ్యారహ్ (జీ5):
{{/usCountry}}తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన 'బాహుబలి' సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజన్‌ను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన డాక్యూసిరీస్ ఇది. 8.9 అత్యుత్తమ ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో ఉంది. సినిమా నిర్మాణ రంగంలో ఆసక్తి ఉన్నవారితో పాటు, సాధారణ సినిమా అభిమానులు కూడా తప్పక చూడాల్సిన సిరీస్ ఇది.
గ్యారహ్ గ్యారహ్ (జీ5):
{{/usCountry}}సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రాఘవ్ జుయాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కాలంలో వెనక్కి వెళ్లి, గతంలో మిస్టరీగా మిగిలిపోయిన పాత కేసులను ఎలా ఛేదించాడు అనేది చాలా ఉత్కంఠభరితంగా స్క్రీన్‌ప్లే చేశారు. దీని ఐఎండీబీ రేటింగ్ 8.1. తెలుగులో కూడా గ్యారహ్ గ్యారహ్ ఓటీటీ రిలీజ్ అయింది.
ప్రీతమ్ అండ్ పెడ్రో (జియో హాట్‌స్టార్):
బాలీవుడ్ సీనియర్ నటుడు అర్షద్ వార్సి లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ప్రీతమ్ అండ్ పెడ్రో జూలై 3 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు భిన్నమైన మనస్తత్వాలు, శైలి కలిగిన పోలీస్ ఆఫీసర్లు కలిసి ఒకే కేసును దర్యాప్తు చేయాల్సి వస్తే జరిగే గందరగోళం, హ్యూమర్ ఈ సిరీస్ ప్రత్యేకత. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (జియో హాట్‌స్టార్):
రొమాంటిక్ పొలిటికల్ రివేంజ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన సిరీస్ తుక్రా కే మేరా ప్యార్ 2 హాట్‌స్టార్ ఓటీటీ టాప్ 10 లిస్ట్‌లో ట్రెండ్ అవుతోంది. కుల వ్యవస్థ, సామాజిక వివక్ష లాంటి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ సాగే ఈ సిరీస్ సీజన్ 2కు సంబంధించిన 12 ఎపిసోడ్‌లు తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
అవతార్ ఫైర్ అండ్ యాష్ (జియో హాట్‌స్టార్):
గత ఏడాది భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్' సిరీస్ లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ విజువల్స్ హోమ్ థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. తెలుగులోనూ అవతార్ 3 ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.