...
...
Next Story

OTT: ఓటీటీలో థర్స్‌డే థండర్- ఒక్కరోజే 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు- హారర్ థ్రిల్లర్ టు హత్తుకునే ప్రేమకథ!

OTT Release Movies New: ప్రతివారం ఓటీటీ ప్రియులకు వినోదాల విందు ఏమాత్రం తగ్గదు. అక్టోబర్ 29న ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్‌తో పాటు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లలో టాప్ 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. థర్స్‌డే థండర్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Oct 31, 2026, 05:55:44 IST
Advertisement

OTT Release Movies And Web Series New: డిజిటల్ వినోద ప్రపంచంలో ఈ వారం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. హారర్ మిస్టరీల నుంచి హృదయానికి హత్తుకునే ప్రేమకథల వరకు విభిన్న జోనర్లలో రూపొందిన 8 చిత్రాలు గురువారం (అక్టోబర్ 29) ఒక్కరోజు ఓటీటీల్లో అడుగుపెట్టాయి. ఈ వీకెండ్ ప్లాన్స్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేందుకు వచ్చిన ఈ థర్స్‌డే థండర్ సినిమాల గురించి తెలుసుకుందాం.

తెల్ల కాగితం (ETV Win)

ఓటీటీలో థర్స్‌డే థండర్- ఒక్కరోజే 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు- హారర్ థ్రిల్లర్ టు హత్తుకునే ప్రేమకథ!
ఓటీటీలో థర్స్‌డే థండర్- ఒక్కరోజే 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు- హారర్ థ్రిల్లర్ టు హత్తుకునే ప్రేమకథ!

2000వ సంవత్సరం నాటి గ్రామీణ భారతదేశం నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తెలుగు టీనేజ్ ప్రేమకథ 'తెల్లకాగితం'. బడికెళ్లే వయసులో పురివిప్పిన తొలి ప్రేమ తీపి జ్ఞాపకాలు, అనుకోకుండా జరిగే ఒక చిన్న పొరపాటు వల్ల ఆ ఇద్దరి జీవితాలు ఎలా మారాయనేది ఈ చిత్ర కథాంశం. తెల్లటి కాగితంపై పడిన ఎర్రటి సిరా చుక్కలా వారి బంధంలో తలెత్తిన సవాళ్లను ప్రేమికులు ఎలా ఎదుర్కొన్నారో ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా చూడవచ్చు.

బలరా: బ్లడ్ ఐలాండ్ (Netflix)

హ్యాలోవీన్ సందర్భంగా భయపెట్టేందుకు వచ్చిన ఫిలిప్పీన్స్ హారర్ మిస్టరీ సిరీస్ ఇది. కనిపించకుండా పోయిన తన తల్లిని వెతుక్కుంటూ ఒక తెలియని ద్వీపానికి వెళ్లిన యువతికి అక్కడ ఎదురైన వింత అనుభవాలు, స్థానిక జానపద కథల చుట్టూ ఈ ఎనిమిది ఎపిసోడ్ల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ తిరుగుతుంది. భయానక వాతావరణంతో థ్రిల్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

బోల్ భావేన్ నా బోల్ (Chaupal OTT)

పంజాబీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'బోల్ భావేన్ నా బోల్'. వ్యక్తపరచలేని భావాలు, మనసులోనే దాచుకున్న రహస్యాల చుట్టూ సాగే ఈ చిత్రంలో సిదక్ గిల్, జాన్యా జోషి జంటగా పరిచయమయ్యారు. చౌపల్ ఓటీటీలో బోల్ భావేన్ నా బోల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ది ఫాల్ ఆఫ్ ఎల్ మయో (Netflix)

బాధ్యతగల కుటుంబ వ్యవస్థను నమ్మే సైమన్, స్వతంత్ర భావాలు ఉండి మాతృత్వానికి దూరంగా ఉండాలనుకునే లూసియా అనే భిన్నమైన వ్యక్తుల మధ్య పుట్టిన ప్రేమకథ ఇది. ఒక బిడ్డను దత్తత తీసుకునే క్రమంలో వారి మధ్య వచ్చే మనస్పర్థలు, ఆ తర్వాత మారే వారి బంధం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

బత్తా (Netflix)

వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరణీధరన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రం 'బత్తా'. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'నడువుల కొంజమ్ పక్కత కాణోమ్', 'సీతాకాతి' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ సారి కూడా ఒక విభిన్నమైన కథాంశంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. తెలుగులో కూడా బత్తా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఘోస్ట్స్ : సీజన్ 6 (JioHotstar)

పట్టణ వాతావరణాన్ని వదిలేసి, తమకు వారసత్వంగా వచ్చిన ఒక పాత బంగ్లాను హోటల్‌గా మార్చాలనుకునే ఒక జంట కథ ఇది. అయితే ఆ ఇంట్లో అప్పటికే నివసిస్తున్న రకరకాల దెయ్యాలు, వాటి వల్ల ఆ దంపతులకు ఎదురైన సరదా అనుభవాలు ఈ కామెడీ సిరీస్‌లో నవ్వులు పూయిస్తాయి. జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ఇమ్మోర్టల్ (Sony LIV)

ఒక సాధారణ జీవితం గడిపే ఓ యువకుడికి రూమ్ షేర్ చేసుకునేందుకు అందమైన యువతి ఆఫర్ ఇస్తుంది. అమ్మాయి, లగ్జరీ ఫ్లాట్, రెంట్ అన్నింటిపరంగా టెంప్ట్ అయిన ఆ యువకుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అతని జీవితం ఒక భయంకరంగా మారుతుంది. పురాతన రహస్యాలు, దైవిక శక్తుల నుంచి తప్పించుకునేందుకు అతడు చేసే పోరాటం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. సోనీ లివ్‌లో తెలుగు, తమిళంలో ఇమ్మోర్టల్ ఓటీటీ రిలీజ్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks