రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ (Toxic) మూవీ మేకర్స్ ఒక పవర్ ప్యాక్డ్ టీజర్‌ను కానుకగా అందించారు. చీకటి సామ్రాజ్యం, రక్తపాతం, గన్స్‌తో నిండిన ఈ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ యశ్ తన ఊరమాస్ లుక్‌తో అలరించారు.
ఎవరీ ‘రాయ’?

"మీ ముందుకు వస్తున్న డేంజర్‌ను ఒకసారి జాగ్రత్తగా చూడండి.. పరిచయం చేస్తున్నాం ‘రాయ’ను" అనే క్యాప్షన్‌తో చిత్రబృందం సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది మూవీ టీమ్. యశ్ టాక్సిక్ టీజర్ బోల్డ్ అండ్ వైల్డ్‌గా అదిరిపోయింది.
టాక్సిక్ టీజర్ ఒక స్మశానవాటికలో జరుగుతున్న అంత్యక్రియల సీన్‌తో మొదలవుతుంది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు హడావిడిగా వెళ్లిపోతుండగా, ఒక కారు ఎంట్రీ ఇస్తుంది. ఆ కారులో నటితో యశ్ శృంగారం చేసే సీన్స్ చూపిస్తారు. కారులో శృంగారం చేస్తూ బయట విలన్స్‌కు బాంబ్ బ్లాస్ట్ చేసేలా ఉంది.
అది నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఆ తర్వాత షర్ట్ లేకుండా బయటకు వచ్చిన యశ్ బ్లాక్ కోట్ వేసుకుని, నోట్లో సిగార్ కాలుస్తూ పొగమంచు మధ్యలో నుంచి ఎంట్రీ ఇస్తాడు. యశ్ నడుచుకుంటూ వచ్చే సీన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. గన్ పట్టుకుని ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ "డాడీ ఈజ్ హోమ్" (Daddy’s Home) అని యశ్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.
హాలీవుడ్ రేంజ్‌లో మేకింగ్
టాక్సిక్ టీజర్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "పక్కా హాలీవుడ్ వైబ్స్ కనిపిస్తున్నాయి", "శాండల్‌వుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి సినిమా రాబోతోంది", "లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టేకింగ్, విజువల్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. మైండ్‌లో నుంచి పోనివ్వని సీన్స్‌తో బోల్డ్ అండ్ వైల్డ్‌గా టాక్సిక్ టీజర్ ఉంది. ఇందులో రాయగా యశ్ ఊరమాస్ అవతారంలో కనిపించిన తీరు అందరిని ఫిదా చేస్తోంది.
సినిమా విశేషాలు
{{/usCountry}}డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టేకింగ్, విజువల్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. మైండ్‌లో నుంచి పోనివ్వని సీన్స్‌తో బోల్డ్ అండ్ వైల్డ్‌గా టాక్సిక్ టీజర్ ఉంది. ఇందులో రాయగా యశ్ ఊరమాస్ అవతారంలో కనిపించిన తీరు అందరిని ఫిదా చేస్తోంది.
సినిమా విశేషాలు
{{/usCountry}}ఇకపోతే టాక్సిక్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించారు.
విశేషం ఏంటంటే, టాక్సిక్ చిత్రానికి యశ్ సహ రచయితగా కూడా వ్యవహరించారు. టాక్సిక్ మూవీలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషీ, అక్షయ్ ఒబెరాయ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. అలాగే కాంతార చాప్టర్ 1 బ్యూటీ రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’ అనే కీలక పాత్రలో కనిపిస్తోంది.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న టాక్సిక్ చిత్రం మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ‘టాక్సిక్’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.