TV Anchor Actress Priyavadhana Suicide: టీవీ స్క్రీన్‌పై నిత్యం చిరునవ్వుతో కనిపిస్తూ వార్తలు చదివే ఆ గొంతు మూగబోయింది. ఎన్నో ఆశలు, కలలతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న 24 ఏళ్ల తమిళ టీవీ యాంకర్, నటి ప్రియవదన ఆత్మహత్య చేసుకోవడం చెన్నై మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
సూర్య కరుప్పు సినిమాలో పాత్ర

చెన్నైలోని 'తంతి టీవీ'లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ప్రియవదన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకు సైతం పరిచయమయ్యారు. కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఇలా అకస్మాత్తుగా దూరమవ్వడం అందరినీ తీవ్రంగా బాధించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో చిరునవ్వులు.. అంతలోనే విషాదం!
మరణానికి కేవలం రెండు రోజుల ముందు వరకు ప్రియవదన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చెన్నై మైలాపూర్‌లోని నవరాత్రి కొలువు వేడుకలను సందర్శించిన వీడియోను, పెళ్లికూతురి గెటప్‌లో చేసుకున్న ఫోటోషూట్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియోల్లో ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ప్రియవదన, ఇంతలోనే ప్రాణాలు తీసుకోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఒక్కగానొక్క కుమార్తె- తల్లడిల్లిన తల్లిదండ్రులు
కొద్ది రోజుల కిందటే ప్రియవదన తన 24వ పుట్టినరోజును ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఎంతో సంతోషంగా కనిపించే ప్రియవదన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. కళ్లముందే ఎంతో భవిష్యత్తు ఉన్న కుమార్తె ఆకస్మికంగా నూరేళ్లు నిండకుండానే వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
నివాళులర్పించిన మీడియా మిత్రులు
{{/usCountry}}ఎంతో సంతోషంగా కనిపించే ప్రియవదన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. కళ్లముందే ఎంతో భవిష్యత్తు ఉన్న కుమార్తె ఆకస్మికంగా నూరేళ్లు నిండకుండానే వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
నివాళులర్పించిన మీడియా మిత్రులు
{{/usCountry}}చెన్నై జాఫర్‌ఖాన్‌పేటలోని ప్రియా నివాసంలో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు మీడియా రంగ ప్రముఖులు, సహచర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనునిత్యం సమాజంలో జరిగే సంఘటనలను, కష్టాలను వార్తల రూపంలో పాఠకులకు, ప్రేక్షకులకు అందించే జర్నలిస్టులే ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం తోటి విలేఖరులను తీవ్రంగా కలచివేస్తోంది.
సోషల్ మీడియా వెనుక దాగున్న మానసిక వేదన
సామాజిక మాధ్యమాల్లో కనిపించే నవ్వుల వెనుక ఒకరి నిజమైన మానసిక స్థితిని అంచనా వేయడం సాధ్యం కాదని ఈ ఘటన చెబుతోంది. పైకి ఎంతో సంతోషంగా కనిపించే వ్యక్తులు కూడా అంతర్గతంగా ఎంతటి మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారో పక్కనున్న వారు కూడా గుర్తించలేకపోవచ్చు. ప్రియవదన ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే దానిపై ఇప్పటివరకు స్పష్టమైన వివరాలు బయటకు రాలేదు.
బాధను దాచుకోవద్దు.. సహాయం కోరండి
"జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. మనసులోని బాధను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల పెద్ద ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకూడదు. మానసిక నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం" అని నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదని, క్లిష్ట సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.