...
...
Next Story

Urfi Javed: పోలీసుల నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. కనీస హక్కును కూడా ఇవ్వట్లేదంటూ ఉర్ఫీ జావేద్ ఫైర్

Urfi Javed Escape From Police Detained: నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీతో పాటు ముంబైలో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ పోలీసుల నుంచి తప్పించుకుంది. అనంతరం పోలీసుల చర్యపై ఫైర్ అవుతూ వీడియో షేర్ చేసింది ఉర్పీ.

Published on: Jul 23, 2026, 09:40:55 IST
Advertisement

Urfi Javed Escape From Police Detained: నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబై వరకు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు రోడ్లపైకి వచ్చాయి.

విద్యార్థుల భవిష్యత్తుతో

పోలీసుల నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. కనీస హక్కును కూడా ఇవ్వట్లేదంటూ ఉర్ఫీ జావేద్ ఫైర్
పోలీసుల నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. కనీస హక్కును కూడా ఇవ్వట్లేదంటూ ఉర్ఫీ జావేద్ ఫైర్

ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్, రఫీ మార్గ్, జంతర్ మంతర్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ వివాదంపై అన్ని ప్రాంతాల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఈ నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారడంతో కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 6 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ ఘటన వెనుక ఉన్న అంతర్గత కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

ముంబైకి పాకిన ఆందోళనలు.. ఉర్ఫీ జావెద్‌కు తప్పిన అరెస్ట్

ఢిల్లీలో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు ముంబై నగరానికి విస్తరించాయి. వరుసగా మూడో రోజు ముంబైలోని శివాజీ నగర్, దాదర్, చైత్యభూమి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్, ఆమె సోదరీమణులు డాలీ, ఆస్ఫిలకు చేదు అనుభవం ఎదురైంది.

దాదర్‌లోని శివాజీ పార్క్ వద్ద నిరసన తెలపడానికి వచ్చిన ప్రముఖ నటి అయేషా ఖాన్‌ను మహిళా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమెను ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్‌లో పడేశారు.

"నలుగురైదుగురు మహిళా పోలీసులు నన్ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. నేను వ్యాన్ ఎక్కకుండా నా శక్తిమొత్తం ఉపయోగించి నిరోధించినప్పటికీ వారు నన్ను లోపలికి తోసేశారు. మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ఎంత అడిగినా ఎవరూ జవాబు చెప్పలేదు. దాదర్ నుంచి మమ్మల్ని తీసుకువెళ్లి వర్లీలో వదిలేశారు" అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయేషా ఖాన్ ఆవేదనతో వివరించారు.

నిరాహార దీక్షలో సోనమ్ వాంగ్‌చుక్.. ఉద్రిక్తంగా పరిస్థితులు

మరోవైపు నిరసన సమరంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. శివాజీ పార్క్, చైత్యభూమి వద్ద ఆందోళనకారులు ఘటనా స్థలానికి చేరుకోకముందే పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు.

కేంద్ర మంత్రి రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆపేది లేదని విద్యార్థి, యువజన సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks