...
...
Next Story

UBS: ఉస్తాద్ భగత్ సింగ్‌కు 54 కోట్లు- కానీ, పవన్ కల్యాణ్ గత సినిమాల కంటే తక్కువ వసూల్లు- ఇవాళ 1.59 మాత్రం కోట్లు!

Ustaad Bhagat Singh Box Office Collection Day 4: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 4 రోజుల్లో రూ. 54 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1.59 కోట్ల వసూల్లు సాధించింది. అయితే, గత సినిమాలతో పోలిస్తే యూబీఎస్ కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి.

Published on: Mar 22, 2026, 14:10:06 IST
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపిస్తే చాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (UBS) విషయంలోనూ అదే జరుగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, ‘ధురంధర్ 2’ వంటి భారీ పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తోంది. అయితే, కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా మిశ్రమ ఫలితాలను నమోదు చేస్తోంది.

మూడు రోజుల వసూళ్లు ఇలా..

ఉస్తాద్ భగత్ సింగ్‌కు 54 కోట్లు- కానీ, పవన్ కల్యాణ్ గత సినిమాల కంటే తక్కువ వసూల్లు- ఇవాళ 1.59 మాత్రం కోట్లు!
ఉస్తాద్ భగత్ సింగ్‌కు 54 కోట్లు- కానీ, పవన్ కల్యాణ్ గత సినిమాల కంటే తక్కువ వసూల్లు- ఇవాళ 1.59 మాత్రం కోట్లు!

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, శనివారం (మార్చి 21) నాడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం భారత్‌లో రూ. 9.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అయితే, ఇది శుక్రవారంతో (రూ. 9 కోట్లు) పోలిస్తే వసూళ్లలో స్వల్ప వృద్ధి (1.7%) కనిపించినప్పటికీ, మొదటి రోజు వచ్చిన రూ. 34.75 కోట్లతో పోలిస్తే భారీ తగ్గుదల కనిపిస్తోంది.

మొత్తంగా మూడు రోజుల్లో ఇండియాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూ. 52.90 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రూ. 50 కోట్ల క్లబ్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం చేరిపోయింది. అలాగే, ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు ఇప్పటివరకు ఇవాళ (మార్చి 22) అంటే నాలుగో రోజున రూ. 1.59 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.

మరింత పెరిగే అవకాశం

ఈ కలెక్షన్స్ నైట్ షోలు ముగిసేసరరికి మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 25 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సక్నిల్క్ సంస్థ వెల్లడించింది.

హరి హర వీరమల్లు (HHVM) సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మూడు రోజుల్లోనే రూ. 64.65 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఓజీ అద్భుతమైన రివ్యూలతో కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 121.70 కోట్లు కొల్లగొట్టింది. ఈ రెండింటి పరంగా చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు చాలా తక్కువగా కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.

మరోవైపు, పోటీలో ఉన్న ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ మూడో రోజు రూ. 5 కోట్లు వసూలు చేసింది. అయితే, ఉస్తాద్‌కు 3340 షోలు ఉంటే, ధురంధర్ కేవలం 1178 షోలతోనే ఈ వసూళ్లను సాధించడం విశేషం. ఆదివారం వసూళ్లు బాగుంటే తప్ప, సోమవారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సినిమా గురించి క్లుప్తంగా..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు, ఎర్లీ మార్నింగ్ షోలు ఉన్నప్పటికీ, ఉస్తాద్ భగత్ సింగ్ కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe