...
...
Next Story

12 కిలోలు పెరిగి మళ్లీ ఏకంగా 15 కిలోలు తగ్గిన స్టార్ హీరో విక్కీ కౌశల్- 500 మందితో ఒప్పందాలు- ఇదంతా ఎందుకోసమో తెలుసా?

Vicky Kaushal Drastic Weight Loss: బాలీవుడ్ స్టార్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ముందు 12 కిలోలు పెరిగి ఆ తర్వాత మళ్లీ ఏకంగా 15 కిలోలు తగ్గిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా లవ్ అండ్ వార్ సినిమా సిబ్బందికి సంబంధించిన 500 మందితో ఒక ఒప్పందం చేయించుకున్నారు మేకర్స్.

Published on: Jul 4, 2026, 06:31:22 IST
Advertisement

Vicky Kaushal 12 Kg Weight Gain And 15 Kg Weight Loss: సినిమాల్లో పాత్రల కోసం ప్రాణం పెట్టే నటుల్లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఒకరు. 'ఉరి', 'ఛావా' లాంటి చిత్రాలతో తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్కీ.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న భారీ పీరియాడిక్ డ్రామా 'లవ్ అండ్ వార్' (Love & War) కోసం నమ్మశక్యం కాని రీతిలో మారిపోయారు.

రెండేళ్లుగా నిర్మాణంలో

12 కిలోలు పెరిగి మళ్లీ ఏకంగా 15 కిలోలు తగ్గిన స్టార్ హీరో విక్కీ కౌశల్- 500 మందితో ఒప్పందాలు- ఇదంతా ఎందుకోసమో తెలుసా?
12 కిలోలు పెరిగి మళ్లీ ఏకంగా 15 కిలోలు తగ్గిన స్టార్ హీరో విక్కీ కౌశల్- 500 మందితో ఒప్పందాలు- ఇదంతా ఎందుకోసమో తెలుసా?

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అయితే ఈ లవ్ అండ్ వార్ సినిమాలోని తన క్యారెక్టర్‌లోని రెండు భిన్నమైన షేడ్స్ కోసం విక్కీ కౌశల్ పడ్డ కష్టం చూసి సెట్స్‌లోని వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

సాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే భారీతనం, ప్రతి పాత్రలోనూ అద్భుతమైన ఎమోషన్స్ కనిపిస్తాయి. మన తెలుగులో వచ్చే భారీ పీరియాడిక్ చిత్రాల తరహాలోనే భన్సాలీ కూడా తన సినిమాల విజువల్స్, నటీనటుల లుక్స్ విషయంలో అస్సలు రాజీపడరు.

ఈ లవ్ అండ్ వార్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లతో కలిసి విక్కీ కౌశల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం విక్కీ, రణ్‌బీర్ ఇద్దరూ ఇందులో ఎయిర్‌ఫోర్స్ పైలట్లుగా కనిపించబోతున్నారు.

12 కిలోలు పెరిగి.. మళ్లీ 15 కిలోలు తగ్గి..

ఈ పాత్ర కోసం విక్కీ కౌశల్ పడ్డ శారీరక శ్రమ అంతా ఇంతా కాదు. సినిమా మొదట్లో ఒక ప్రత్యేక లుక్ కోసం ఆయన ఏకంగా 12 కిలోల బరువు పెరిగారు. ఆ తర్వాత కథలో వచ్చే ట్విస్ట్‌కు తగ్గట్టుగా, క్లైమాక్స్ షూటింగ్ సమయానికి కఠినమైన డైట్, వర్కవుట్స్ చేసి ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు.

లవ్ అండ్ వార్ సినిమాను 2024లో ప్రకటించారు. మొదట 2025 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నా, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సినిమా స్కేల్ చాలా పెద్దది కావడం వల్లే షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని 2027 జనవరి 21న రిపబ్లిక్ డే వీకెండ్ టార్గెట్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

500 మందితో ఒప్పందాలు

ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా ఉండేందుకు భన్సాలీ టీమ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రధాన నటీనటులతో పాటు సెట్‌లో పనిచేసే దాదాపు 500 మందికి పైగా క్రూ మెంబర్స్ చేత 'నో డిస్‌క్లోజర్ అగ్రిమెంట్' (NDA) పై సంతకాలు చేయించారు.

సినిమా ప్రపంచాన్ని, అందులోని విజువల్స్‌ను ప్రేక్షకులు నేరుగా థియేటర్లలోనే చూసి థ్రిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు.

అలియా భట్‌కు 'గంగూబాయ్ కతియావాడి' తర్వాత భన్సాలీతో ఇది రెండో సినిమా కాగా, రణ్‌బీర్‌కు 'సావరియా' తర్వాత రెండో చిత్రం.

కత్రినా కైఫ్ భర్త

అయితే విక్కీ కౌశల్‌కు మాత్రం సంజయ్ భన్సాలీ కాంబినేషన్‌లో ఇదే మొదటి సినిమా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ అని తెలిసిన విషయమే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks