...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరోయిన్ రాశి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునే సీన్లతో తాత, మనవడు, తల్లి కథ- ఇక్కడ చూడండి!

ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం విజయ్ కేరాఫ్ రామారావు స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాలో సినియర్ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషించారు. మనసుకు హత్తుకునే సీన్లతో తాత, తల్లి, మనవడు పాత్రలతో హృద్యంగా తెరకెక్కించారు. మరి విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 9, 2025, 12:48:16 IST
Advertisement

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వచ్చే వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ వారం ఓటీటీల్లో చాలా వరకు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా ఫ్రైడే రోజున ఓటీటీ రిలీజెస్ అయ్యాయి.

తెలుగు సినిమా

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరోయిన్ రాశి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునే సీన్లతో తాత, మనవడు, తల్లి కథ- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరోయిన్ రాశి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునే సీన్లతో తాత, మనవడు, తల్లి కథ- ఇక్కడ చూడండి!

ఇదిలా ఉంటే, ప్రతి ఆదివారం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే తెలుగు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం అంటే ఇవాళ (నవంబర్ 9) కూడా స్వచ్ఛమైన తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. ఆ మూవీనే విజయ్ కేరాఫ్ రామారావు.

సీనియర్ హీరోయిన్ రాశి

ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషించింది. విజయ్ కేరాఫ్ రామారావులో రాశి తల్లిగా, కూతురిగా, భార్యగా యాక్ట్ చేసింది. ఈ మూవీలో రాశితోపాటు శంకర్ మహంతి, మహేంద్ర గణచారి, మేఘన, పీవీఎన్ కార్తికేయ కీలక పాత్రలు పోషించారు.

నటనతోపాటు దర్శకత్వం

ఉదయ్ కుమార్ సద్దాల నిర్మాతగా వ్యవహరించి నిర్మించిన విజయ్ కేరాఫ్ రామారావు సినిమాకు పీవీఎన్ కార్తికేయ కథ, దర్శకత్వం వహించారు. అలాగే నటుడిగా చేశారు. సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా శివ గెడ్డం వ్యవహరించగా చరణ్ మేసల్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈశ్వర్ చంద్ మ్యూజిక్ అందించారు.

80 ఏళ్ల వ్యక్తి కథ

శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్‌గా వర్క్ చేసిన విజయ్ కేరాఫ్ రామారావు సినిమా తాత, మనవడు, తల్లి పాత్రల చుట్టూనే ప్రధానంగా తిరుగుతుంది. 80 ఏళ్ల వ్యక్తి ఇండిపెండెంట్‌గా తన సొంత మార్గాల్లో స్థిరపడి జీవిస్తుంటాడు. కూతురు, అల్లుడు, మనవడితో కలిసి జీవించే పరిస్థితి వస్తుంది.

లోలోపల ఉన్న అనురాగాలను

ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఇవాళ విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీ రిలీజ్ అయింది.

38 నిమిషాల 26 సెకన్ల రన్‌టైమ్

సుమారుగా 38 నిమిషాల 26 సెకన్ల రన్‌టైమ్ ఉన్న తెలుగు ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా విజయ్ కెరాఫ్ రామారావును ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు. ఇదిలా ఉంటే, ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ ప్రతి వారం సరికొత్త చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్

అతి తక్కువ రన్‌టైమ్‌తో ఈటీవీ విన్‌లో కథా సుధా వీక్లీ సిరీస్ అనే టైటిల్‌తో అచ్చ తెలుగు ఓటీటీ సినిమాలు ప్రతి ఆదివారం డిజిటల్ ప్రీమియ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాత, మనవడు, తల్లి మూడు జెనరేషన్స్‌ల కథగా నేటి నుంచి ఈటీవీ విన్‌లో విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks