...
...
Next Story

Vijay Sethupathi: నాన్న కోసం అప్పుల వాళ్లు వస్తే నేనే డీల్ చేసేవాన్ని, కూలీ పనికి వెళ్లా.. విజయ్ సేతుపతి కామెంట్స్

Vijay Sethupathi Recalls Childhood: విలక్షణ నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ సేతుపతి తన బాల్యంలోని ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు ఫోన్ బూత్‌లో పనిచేసిన తాను, నేడు అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఎలా ఎదిగారో వివరించారు.

Published on: Jul 16, 2026, 17:58:48 IST
Advertisement

Vijay Sethupathi Recalls Childhood: భారతీయ చలనచిత్ర రంగంలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కమర్షియల్ సినిమాల్లో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూనే, అవార్డు విన్నింగ్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

కోట్లాది రూపాయల పారితోషికం

నాన్న కోసం అప్పుల వాళ్లు వస్తే నేనే డీల్ చేసేవాన్ని, కూలీ పనికి వెళ్లా.. విజయ్ సేతుపతి కామెంట్స్
నాన్న కోసం అప్పుల వాళ్లు వస్తే నేనే డీల్ చేసేవాన్ని, కూలీ పనికి వెళ్లా.. విజయ్ సేతుపతి కామెంట్స్

కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ 'మక్కల్ సెల్వన్' సినీ ప్రయాణం పూలబాట ఏమీ కాదు. ప్రస్తుతం కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరిన విజయ్ సేతుపతి, తన కెరీర్ ప్రారంభానికి ముందు చూసిన పేదరికం, పడ్డ కష్టాల గురించి తాజాగా పంచుకున్నారు.

విజయ్ సేతుపతి నటించిన'ఉప్పెన', 'మహారాజా' చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన సినిమా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ సేతుపతి పంచుకున్న గతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అప్పుల వాళ్లతో పోరాటం

ఇటీవల ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్న వయసులోనే ఆర్థిక ఇబ్బందులు తనను ఎంత పరిణతి చెందేలా చేశాయో వివరించారు. ఇంట్లో నిరంతరం ఉండే పేదరికం తమ కుటుంబ నిర్ణయాలను ఎలా శాసించిందో చెప్పారు.

సినిమాల్లోకి రావడం అనేది తన జీవితంలో అసలు ప్లాన్‌లోనే లేదని విజయ్ సేతుపతి వెల్లడించారు. చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేయడం అంటే తనకు ఇష్టమని, భవిష్యత్తులో ఒక మంచి బిజినెస్‌మెన్ అవ్వాలని కలలు కన్నట్లు చెప్పారు.

"నాకు సినిమాల్లో నటించాలనే కోరిక అస్సలు ఉండేది కాదు. వ్యాపారవేత్త కావాలని అనుకునేవాణ్ణి. స్కూల్ చదివే రోజుల్లోనే రోజువారీ కూలీ పనులకు వెళ్లాను. ఆ తర్వాత ఒక టెలిఫోన్ బూత్‌లో కూడా పనిచేశాను. జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను, నైట్ షూట్స్‌లో కష్టపడ్డాను" అని విజయ్ తెలిపారు.

చిన్న పాత్రల నుంచి నేషనల్ అవార్డుల వరకు

సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా చిన్న చిన్న సహాయక పాత్రలతో విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభించారు. 2012లో వచ్చిన 'పిజ్జా', 'నడువుల కొంజమ్ పక్కత కానీమ్' చిత్రాలు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఆ తర్వాత 'సూదు కవ్వుమ్', 'విక్రమ్ వేద', '96', 'సూపర్ డీలక్స్', 'మాస్టర్', 'విక్రమ్', 'జవాన్' చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన 'మహారాజా' సినిమాలో తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

2023లో షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన 'ఫర్జీ' సిరీస్ ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు.

చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు

విజయ్ సేతుపతి చివరిగా 2026లో విడుదలైన 'గాంధీ టాక్స్' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' సినిమాలో ఆయనతోపాటు టబు, సంయుక్త, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీనితో పాటు ప్రముఖ దర్శకుడు మిస్సిన్ కాంబినేషన్‌లో వస్తున్న 'ట్రైన్' సినిమాలోనూ నటిస్తున్నారు విజయ్ సేతుపతి. ఇందులో శ్రుతి హాసన్, నాజర్, ఇరా దయానంద్‌రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks