Jason Sanjay On Acting And Sigma Delayed: తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే తండ్రిలా కెమెరా ముందుకు కాకుండా, కెమెరా వెనుక ఉండి కథను నడిపించే డైరెక్టర్‌గా ఆయన పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'సిగ్మా' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ద్వారా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేసన్ సంజయ్ తన సినీ ప్రయాణం, నటనపై ఆసక్తి, తండ్రితో బాక్సాఫీస్ పోటీపై మనసు విప్పి మాట్లాడారు.
ప్రేమమ్ డైరెక్టర్ ఆఫర్ ఎందుకు కాదన్నారంటే?
తను నటుడిగా మారాలని చాలామంది కోరుకున్నట్లు జేసన్ తెలిపారు. 'ప్రేమమ్' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ సైతం జేసన్ వద్దకు ఒక అద్భుతమైన కథతో వచ్చారట. అప్పటికి జేసన్ వయస్సు కేవలం 20 ఏళ్లు. ఆ సమయంలో సినిమా రంగాన్ని తన వృత్తిగా ఎంచుకోవాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు జేసన్ వివరించారు.
ఆ సినిమా చేయడానికి తగిన వ్యక్తిని ఎంచుకోవాలని అల్ఫోన్స్ పుత్రెన్ను కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ అంతటి గొప్ప దర్శకుడు తనను సంప్రదించడం గర్వంగా అనిపించిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
హీరోగా మారుతున్నారని
{{/usCountry}}ఆ సినిమా చేయడానికి తగిన వ్యక్తిని ఎంచుకోవాలని అల్ఫోన్స్ పుత్రెన్ను కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ అంతటి గొప్ప దర్శకుడు తనను సంప్రదించడం గర్వంగా అనిపించిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
హీరోగా మారుతున్నారని
{{/usCountry}}ఇటీవల విడుదలైన 'సిగ్మా స్టైల్' ప్రమోషనల్ సాంగ్‌లో జేసన్ చిందులు వేయడం చూసి ఆయన హీరోగా మారుతున్నారా అనే ప్రచారం నడిచింది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇస్తూ, కేవలం సినిమా ప్రమోషన్ కోసం, సరదాగానే ఆ పాటలో కనిపించానని స్పష్టం చేశారు.
"ప్రతి దర్శకుడి లోపల ఒక నటుడు దాగి ఉంటాడు. నాలోనూ ఒక నటుడు ఉన్నాడు. కానీ ప్రస్తుతం నా పూర్తి దృష్టి 'సిగ్మా' సినిమాను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపైనే ఉంది" అని జేసన్ సంజయ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నటన వైపు అడుగులు వేస్తారా లేదా అనేది ఈ సినిమా విడుదలైన తర్వాతే ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.
తండ్రి విజయ్ 'జన నాయగన్' సినిమా కోసమే వాయిదా?
సాధారణంగా పెద్ద సినిమాల క్లాష్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట 'సిగ్మా' సినిమాను జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అదే సమయంలో తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా'జన నాయగన్' జూలై 23న థియేటర్లలోకి రానుంది.
దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో, హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలవుతోంది. థియేటర్ల కొరత తలెత్తకుండా ఉండటానికి, తండ్రి సినిమా విజయానికి మార్గం సుగమం చేస్తూ 'సిగ్మా' విడుదలను ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
తెలుగు హీరో కావడం
కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేసిన జేసన్ సంజయ్, టాలెంట్ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో తన తొలి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం బాగా పరిచయమున్న సందీప్ కిషన్ హీరోగా చేస్తుండటంతో ఈ సినిమాపై తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి.