గత కొన్ని రోజులుగా యావత్ సోషల్ మీడియాను ఊపేసిన ‘విరోష్’ (Vijay & Rashmika) వివాహ వేడుకలు గ్రాండ్‌గా ముగిశాయి. ఫిబ్రవరి 24న క్రికెట్ మ్యాచ్‌తో మొదలైన వీరి ప్రీ-వెడ్డింగ్ సందడి.. 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డ్రీమ్ వెడ్డింగ్‌తో పతాక స్థాయికి చేరింది.
సినీ ప్రముఖులు, బంధువుల కోసం

ఇక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, బంధువుల కోసం ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్‌తో విరోష్ వెడ్డింగ్ వేడుకలు అధికారికంగా ముగిశాయి. ప్రస్తుతం ఈ నూతన జంట ‘అండర్ గ్రౌండ్’కు వెళ్తున్నట్లు సరదాగా ప్రకటించింది.
రెండు సాంప్రదాయ పద్ధతుల్లో
అటు తెలుగు, ఇటు కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో విజయ్, రష్మికల పెళ్లి, వారి దుస్తులు, సంగీత్ సెటప్, పెళ్లి తర్వాత వారు తమ సొంత ఊర్లకు వెళ్లి నిర్వహించిన సంప్రదాయ పూజలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
విరోష్ వెడ్డింగ్ బడ్జెట్
ఈ క్రమంలోనే ఈ విరోష్ వెడ్డింగ్ బడ్జెట్ ఎంత ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. విజయ్, రష్మికల వివాహ వేడుకల కోసం సుమారు రూ. 15 నుంచి 25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మ్యారేజ్ కోసం ప్రత్యేకంగా 3 కేజీల బంగారు ఆభరణాలు చేయించారట.
విరోష్ వెడ్డింగ్ ఓటీటీ రైట్స్
ఈ మొత్తం ఈవెంట్‌ను ప్రముఖ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ ఆర్గనైజ్ చేసింది. అలాగే, విజయ్, రష్మికల పెళ్లి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 60 కోట్లు ఆఫర్ చేసింది. కానీ, ఈ జంట ఆ డీల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఓటీటీ డీల్ ఒప్పుకుంటే
పెళ్లి అనేది వ్యక్తిగతమైన వేడుకగా ఉండాలనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ డీల్ ఒప్పుకుంటే పెళ్లి ద్వారా రూ. 60 కోట్లు వచ్చినట్లే. ఈ ఓటీటీ రైట్స్ వల్ల పెళ్లి ఖర్చులు పోను రూ. 35 కోట్లకుపైగా లాభం వచ్చే అవకాశం ఉంది.
రాచ మర్యాదలు.. విలాసవంతమైన వేదికలు
{{/usCountry}}పెళ్లి అనేది వ్యక్తిగతమైన వేడుకగా ఉండాలనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ డీల్ ఒప్పుకుంటే పెళ్లి ద్వారా రూ. 60 కోట్లు వచ్చినట్లే. ఈ ఓటీటీ రైట్స్ వల్ల పెళ్లి ఖర్చులు పోను రూ. 35 కోట్లకుపైగా లాభం వచ్చే అవకాశం ఉంది.
రాచ మర్యాదలు.. విలాసవంతమైన వేదికలు
{{/usCountry}}ఉదయ్‌పూర్‌లోని అత్యంత విలాసవంతమైన 5-స్టార్ ప్రాపర్టీ ‘ఐటిసి మెమెంటోస్’లో వీరి ప్రధాన వేడుకలు జరిగాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా తమ అభిమానుల కోసం ఉచిత భోజనాలు, స్వీట్ల పంపిణీ చేపట్టి తమ ఉదారతను చాటుకున్నారు. చివరిగా హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘తాజ్ కృష్ణ’ హోటల్‌లో రిసెప్షన్ నిర్వహించారు. టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా ఇది నిలిచిపోనుంది.
గీత గోవిందం టు రణబాలి
పెళ్లి వేడుకల తర్వాత విజయ్, రష్మిక మందన్నా తమ సొంత ఊర్లకు వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గీత గోవిందం సినిమాతో పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారి భార్యాభర్తలను చేసింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటించిన రణబాలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.