...
...
Next Story

Vishal Vijay TVK: అది ప్రజా తీర్పును అవమానించడమే, విజయ్‌కు అవకాశం ఎందుకివ్వడం లేదు.. హీరో విశాల్ కొత్త ట్వీట్

Vishal Tweet On Vijay TVK Vs DMK AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టిన దళపతి విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీ మార్కుకు అడుగు దూరంలో నిలిచిన విజయ్‌ను మేజిక్ నంబర్ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడంపై హీరో విశాల్ మరో కొత్త ట్వీట్ వేశాడు.

Published on: May 8, 2026, 12:08:06 IST
Advertisement

Vishal Tweet On Vijay TVK Vs DMK AIADMK: దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు చెక్ పెడుతూ నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) తమిళనాడులో ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను టీవీకే వెనక్కి నెట్టి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఇరకాటంలో పడిన టీవీకే

అది ప్రజా తీర్పును అవమానించడమే, విజయ్‌కు అవకాశం ఎందుకివ్వడం లేదు.. హీరో విశాల్ కొత్త ట్వీట్ (PTI)
అది ప్రజా తీర్పును అవమానించడమే, విజయ్‌కు అవకాశం ఎందుకివ్వడం లేదు.. హీరో విశాల్ కొత్త ట్వీట్ (PTI)

అయితే, విజయ గీతం పాడాల్సిన సమయంలో రాజ్‌భవన్ నుంచి ఎదురైన ఒక నిబంధన టీవీకేను ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే. మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేయడంతో తమిళ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది.

మేజిక్ నంబర్ కోసం పాట్లు

తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో టీవీకే బలం 113కు చేరింది. మెజారిటీ మార్కుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతు కావాల్సి ఉంది.

ఈ క్రమంలోనే గవర్నర్ రాజేంద్ర.. విజయ్‌తో రెండోసారి భేటీ అయి, మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గురువారం నాటి కల్లా సమర్పించాలని ఆదేశించారు. కేవలం 'అతిపెద్ద పార్టీ' అన్న హోదా సరిపోదని, స్పష్టమైన మెజారిటీ సంఖ్య ఉండాలని గవర్నర్ ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు.

డీఎంకే - ఏఐఏడీఎంకే ఒక్కటవుతాయా?

ఈ రాజకీయ అనిశ్చితి మధ్య ఒక విచిత్రమైన పరిణామం తెరపైకి వస్తోంది. దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు.. విజయ్‌ని అధికారం నుంచి దూరంగా ఉంచేందుకు చేతులు కలుపుతాయన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.

విజయ్ రాజకీయ ప్రస్థానానికి సినీ గ్లామర్ తోడైంది. ప్రకాష్ రాజ్, ఖుష్బూ, కమల్ హాసన్ వంటి ప్రముఖులు ఇప్పటికే దళపతి విజయ్‌కి అండగా నిలవగా, హీరో విశాల్ ఎక్స్‌ (X) వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నెట్టింట్లో విశాల్ కొత్త ట్వీట్ వైరల్ అవడమే కాకుండా హీరో అడిగిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.

విశాల్ ట్వీట్

"ఒకవేళ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా.. డీఎంకే, ఏఐఏడీఎంకే కలిస్తే అది ప్రజా తీర్పును అవమానించడమే. గతంలో గోవా, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోమని (Floor Test) గవర్నర్లు చెప్పారు. మరి తమిళనాడులో విజయ్‌కు ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? గవర్నర్ పాలన కంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ముఖ్యం" అని విశాల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. దళపతి విజయ్ మెజారిటీ సాధించి పీఠం ఎక్కుతారా లేక పాత రాజకీయ ప్రత్యర్థులు ఏకమై 'దళపతి'కి చెక్ పెడతారా అన్నది తేలాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe