...
...
Next Story

Legacy Release Date: పొలిటికల్ థ్రిల్లర్ తో మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. లెగసీ రిలీజ్ డేట్ ఇదే.. ఫౌజీతో బాక్సాఫీస్ క్లాష్

Legacy Release Date: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లెగసీ’ సినిమాతో థియేటర్లకు రాబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

Published on: Sep 5, 2026, 20:02:43 IST
Advertisement

Legacy Release Date: 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'లెగసీ' (LEGACY). ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను 2026 డిసెంబర్ 4న థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

లెగసీ రిలీజ్ డేట్

పొలిటికల్ థ్రిల్లర్ తో మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. లెగసీ రిలీజ్ డేట్ ఇదే.. ఫౌజీతో బాక్సాఫీస్ క్లాష్ (x/VishwakSenActor)
పొలిటికల్ థ్రిల్లర్ తో మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. లెగసీ రిలీజ్ డేట్ ఇదే.. ఫౌజీతో బాక్సాఫీస్ క్లాష్ (x/VishwakSenActor)

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రూట్ మార్చాడు. ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ తో థియేటర్లకు రాబోతున్నాడు. అతని అప్ కమింగ్ మూవీ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ను ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించారు. ఇందులో విశ్వక్ సేన్ కు జోడీగా ఏక్తా రాథోడ్ హీరోయిన్ గా నటిస్తోంది.

పోస్టర్ వైరల్

లెగసీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో ఒక్కో గుర్రంపై ఉన్న హీరో, హీరోయిన్ లిప్ కిస్ పెట్టుకుంటున్నారు. ఈ పోస్టర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా, చిత్రం వెనుక ఉన్న రాజకీయ నేపథ్యంపై ఆసక్తిని పెంచింది.

రివెంజ్ కాన్సెప్ట్‌తో పవర్‌ఫుల్ స్టోరీ

అధికారం, కుటుంబం, ప్రేమ, నమ్మకద్రోహం చుట్టూ సాగే తీవ్రమైన పోరాటం ఆధారంగా లెగసీ మూవీ స్టోరీ సాగుతుందని తెలుస్తోంది. తన తండ్రి వదిలివెళ్లిన రాజకీయ వారసత్వం (లెగసీ) వల్ల ఒక సాధారణ యువకుడు ఎంతటి ప్రమాదకరమైన, సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్లాడనే అంశాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారని టాక్.

హారర్ థ్రిల్లర్ 'పిండం'తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ రెడ్డి ఈ లెగసీ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు.

ఫౌజీతో ఢీ

లెగసీ మేకర్స్ భారీ రిస్క్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ మూవీతో లెగసీ క్లాష్ అవుతుండటమే అందుకు కారణం. ఫౌజీ సినిమాను డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఫౌజీతో బాక్సాఫీస్ ఫైట్ లో లెగసీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks