Vishwanath And Sons OTT Release Platform Details: తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాలో హీరోయిన్‌గా యూత్ డ్రీమ్ గర్ల్ మమితా బైజు చేసింది.
ఇద్దరు సీనియర్ హీరోయిన్స్

సీనియర్ హీరోయిన్స్ రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, యోగిబాబు, మ్యాథ్యూ వర్గీస్, వైవా హర్ష తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 14న అంటే నిన్న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ఈ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా సన్ ఆఫ్ విశ్వనాథ్ వచ్చేసింది.
సూర్య ఈ సినిమాలో సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ షూటర్ పాత్రలో కనిపిస్తారు. కెరీర్, గెలుపుపైనే దృష్టి పెట్టిన ఒక క్రీడాకారుడి జీవితంలో వయసు పెరుగుతున్న కొద్దీ కుటుంబ బాధ్యతలు, ఊహించని ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పాయనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
ఆశయాలు, పర్సనల్ లైఫ్ మధ్య
తన ఆశయాలు, వ్యక్తిగత జీవితం మధ్య సంజయ్ ఎలా బ్యాలెన్స్ చేశాడనేది డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎమోషనల్‌గా తెరకెక్కించారు. మమితా బైజు నటన, సూర్యతో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, కె. ఎన్. విజయ్ కుమార్ మాటలు అందించారు. శేఖర్ వి జె, విజయ్ బిన్నీ డాన్స్ కొరియోగ్రఫీ చేయగా, వి వెంకట్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు.
సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ
{{/usCountry}}శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, కె. ఎన్. విజయ్ కుమార్ మాటలు అందించారు. శేఖర్ వి జె, విజయ్ బిన్నీ డాన్స్ కొరియోగ్రఫీ చేయగా, వి వెంకట్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు.
సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ
{{/usCountry}}మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. దిగ్గజ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు రూ. 85 కోట్లకు విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. సినిమాలోని పోస్టర్స్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ లోగో ద్వారా ఈ విషయం తెలుస్తోంది.
ఇక, విశ్వనాథ్ అండ్ సన్స్ శాటిలైట్ రైట్స్‌ను రూ. 28 కోట్లు, ఆడియో హక్కులు రూ. 12 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రైడ్ వర్గాల సమాచారం. ఇదే కాకుండా ఓవరాల్‌గా విశ్వనాథ్ అండ్ సన్స్ థియేట్రికల్ హక్కులు రూ. 90 కోట్లకు, నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 125 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
దీంతో విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 215 కోట్ల వరకు రాబట్టాయని టాక్. ఇలా క్రేజీ డీల్స్ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ రిలీజ్ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, సెప్టెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో సన్ ఆఫ్ విశ్వనాథ్ ఓటీటీ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉందని ఇన్‌సైడ్ టాక్.
ఓటీటీకి రాకముందే
కాకపోతే సూర్య, మమితా బైజుల కెమిస్ట్రీని ఓటీటీలోకి రావడానికంటే ముందే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను థియేటర్లలో చూడటం బెటర్ ఆప్షన్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.