OTT Sci Fi Thriller Xeno Release Today: సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే అద్భుతమైన విజువల్స్, ఊహకందని గ్రహాంతరవాసులు (ఏలియన్స్) గుర్తొస్తాయి. అలాంటి కోవలోనే ఒక హృదయపూర్వకమైన భావోద్వేగ ప్రయాణాన్ని చూపేందుకు సిద్ధమైంది సరికొత్త హాలీవుడ్ చిత్రం 'గ్జెనో' (Xeno).
అమ్మాయితో ఏలియన్ స్నేహం

ఒక సాధారణ అమ్మాయికి, భయంకరంగా కనిపించే ఒక గ్రహాంతరవాసికి మధ్య ఏర్పడిన అపురూపమైన బంధం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ గ్జెనో ఓటీటీలోకి వచ్చేసింది.
'కోయి మిల్ గయా' వంటి సినిమాలు మనుషులకు, ఏలియన్స్‌కు మధ్య ఉండే విడదీయరాని స్నేహాన్ని అద్భుతంగా చూపించి క్లాసిక్‌లుగా నిలిచాయి. సరిగ్గా అదే తరహా అనుభూతిని ఇస్తూనే, కొంత విభిన్నంగా మరికొంత ఉత్కంఠభరితంగా సాగే సరికొత్త కథాంశంతో 'గ్జెనో' సినిమాను మేకర్స్ తెరకెక్కించారు.
ఎడారిలో ఎదురైన ఊహించని పరిచయం
ప్రఖ్యాత నటుడు, నిర్మాత కెవిన్ హార్ట్ నేతృత్వంలోని 'హార్ట్‌బీట్' బ్యానర్‌తో కలిసి మాథ్యూ లోరెన్ ఓట్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. మనుషుల రణగొణ ధ్వనులకు, ఆధునిక నగర జీవితానికి చాలా దూరంగా ఉండే ఒక సుదూర ఎడారి ప్రాంతంలో కథానాయిక రినీ (లులు విల్సన్) నివసిస్తుంటుంది.
ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఒక ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఒకరోజు ఎడారిలోని ఇసుక తిన్నెల మధ్య ఆమెకు ఒక వింత జీవి కనిపిస్తుంది. అది మన భూమికి చెందని ఒక గ్రహాంతరవాసి. మొదట ఆ భయంకరమైన రూపాన్ని చూసి ఆ అమ్మాయి ఎంతగానో భయపడుతుంది.
అయితే ఆ భయం వెనుక ఆ వింత జీవి కూడా ఒంటరితనంతో, ఆందోళనతో బాధపడుతున్నట్లు హీరోయిన్ గుర్తిస్తుంది. అలా భయంతో మొదలైన వారి పరిచయం క్రమంగా జిజ్ఞాసగా, ఆపై ఒక అద్భుతమైన స్నేహ బంధంగా మారుతుంది.
మాటలు లేని బంధం
{{/usCountry}}అయితే ఆ భయం వెనుక ఆ వింత జీవి కూడా ఒంటరితనంతో, ఆందోళనతో బాధపడుతున్నట్లు హీరోయిన్ గుర్తిస్తుంది. అలా భయంతో మొదలైన వారి పరిచయం క్రమంగా జిజ్ఞాసగా, ఆపై ఒక అద్భుతమైన స్నేహ బంధంగా మారుతుంది.
మాటలు లేని బంధం
{{/usCountry}}సాధారణంగా భాష ద్వారానే భావాలను పంచుకుంటాం. కానీ ఈ సినిమాలో అమ్మాయికి, ఏలియన్‌కు మధ్య ఎలాంటి ఉమ్మడి భాష ఉండదు. కేవలం సైగలు, ఒకరినొకరు నిశితంగా గమనించడం ద్వారా నమ్మకాన్ని పెంపొందించుకుంటారు. పైకి ఎంత క్రూరంగా కనిపించినప్పటికీ, ఆ వింత జీవిలో దాగి ఉన్న సున్నితత్వాన్ని ఆమె గమనిస్తుంది.
రూపం చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదనే సత్యాన్ని ఈ చిత్రం కళ్లకు కడుతుంది. వారి మధ్య ఉన్న స్నేహం గురించిన రహస్యం బయటకు పొక్కడంతో, ఆ ఏలియన్‌ను ఒక ముప్పుగా భావించే శక్తుల నుంచి కాపాడేందుకు ఆ అమ్మాయి ఎడారి మార్గంలో ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయాల్సి వస్తుంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఇలా సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గ్జెనో సినిమాకు రొట్టెన్ టొమోటాస్ 88 శాతం ఫ్రెష్ కంటెంట్ అని ప్రకటించింది. అలాంటి గ్జెనో ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో ఇవాళ గ్జెనో ఓటీటీ రిలీజ్ అయింది.
ఇంగ్లీషుతోపాటు తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో హాట్‌స్టార్‌లో గ్జెనో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇదివరకే ఇంకో ఓటీటీలో గ్జెనో అందుబాటులో ఉంది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇదే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి అది కూడా సేమ్ 4 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో గ్జెనో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా 2 ఓటీటీల్లో తెలుగులో గ్జెనో అందుబాటులో ఉంది.