Yash Toxic Advance Booking In 48 Hours: కేజీఎఫ్ శ్రేణితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా తెరకెక్కిన సరికొత్త చిత్రం 'టాక్సిక్'. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే, టాక్సిక్ సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే, అంటే శుక్రవారం (ఆగస్ట్ 21) ఉదయం నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద టికెట్ల వేట మొదలైంది. బుకింగ్స్ మొదలైన తొలి 24 గంటల్లోనే టాక్సిక్ చిత్రం కనివిని ఎరుగని రీతిలో అరుదైన రికార్డ్ సాధించింది.
బాక్సాఫీస్ వద్ద 'టాక్సిక్' విధ్వంసం..
శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ టికెటింగ్ వేదికలపై 'టాక్సిక్' బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్‌మైషోలో ప్రతీ గంటకు ఏకంగా 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతుండటం యశ్ క్రేజ్‌కు నిదర్శనం అని చెప్పొచ్చు.
రూ. 18 కోట్ల మార్క్ దాటిన వసూళ్లు
అడ్వాన్స్ టికెట్ల విక్రయాలు మొదలైన కేవలం 48 గంటల్లోనే టాక్సిక్ సినిమా రూ. 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 4.7 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క కన్నడ ఒరిజినల్ వెర్షన్ నుంచే రూ. 10 కోట్ల వసూళ్లు రావడం విశేషం.
పాన్-ఇండియా రేంజ్లో మన సినిమాలకు దక్షిణాదితో పాటు ఉత్తరాది మార్కెట్ కూడా చాలా కీలకం. కేజీఎఫ్ సిరీస్‌తో హిందీ బెల్ట్‌లో బలమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న యశ్, ఈసారి హిందీ డబ్బింగ్ వెర్షన్తోనూ ట్రేడ్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నారు.
'జవాన్', 'యానిమల్' రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయ్!
{{/usCountry}}పాన్-ఇండియా రేంజ్లో మన సినిమాలకు దక్షిణాదితో పాటు ఉత్తరాది మార్కెట్ కూడా చాలా కీలకం. కేజీఎఫ్ సిరీస్‌తో హిందీ బెల్ట్‌లో బలమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న యశ్, ఈసారి హిందీ డబ్బింగ్ వెర్షన్తోనూ ట్రేడ్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నారు.
'జవాన్', 'యానిమల్' రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయ్!
{{/usCountry}}టాక్సిక్ హిందీ వెర్షన్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి, ముంబై సహా ఉత్తరాది ప్రధాన నగరాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి 24 గంటల్లోనే 'టాక్సిక్' చిత్రం భారతదేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల టికెట్లను విక్రయించి ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది.
గతంలో సంచలనం సృష్టించిన అనేక చిత్రాల తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను యశ్ సినిమా అధిగమించింది. "తొలి 24 గంటల్లో షారుఖ్ ఖాన్ 'జవాన్' 1.5 లక్షలు, రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' 1.3 లక్షలు, రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' 55 వేల టికెట్లు అమ్మగా.. 'టాక్సిక్' ఏకంగా 2.5 లక్షల టికెట్లతో వాటన్నింటినీ దాటేసింది" అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తొలి రోజులోనే 60 వేల టికెట్లు
కేవలం హిందీ వెర్షన్ బుకింగ్స్ చూసుకున్నా, తొలి రోజులోనే 60 వేల టికెట్లు అమ్ముడై 'యానిమల్' రికార్డును దాటేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, భారీ తారాగణంతో తెరకెక్కిన 'టాక్సిక్' చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ముఖ్యపాత్రలు పోషించారు.
బోల్డ్ కంటెంట్.. ఎలాంటి కట్స్ లేకుండా ఏ-సర్టిఫికెట్!
వయోలెంట్ యాక్షన్, కొన్ని బోల్డ్ సన్నివేశాలు, ఘాటైన సంభాషణలు ఉన్నందున సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ విధించకుండా నేరుగా 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ మంజూరు చేసింది. కంటెంట్ ఎంత వివాదాస్పదంగా అనిపించినా, విజువల్ ప్యాకేజింగ్, కథనం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆగస్టు 26న టాక్సిక్స్ సినిమా వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటివరకు వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్‌తో టాక్సిక్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఆల్-టైమ్ రికార్డు వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
టాక్సిక్ ధురంధర్ 2, యానిమల్, జవాన్ టాక్సిక్ తన మొదటి 24 గంటల్లో ముందస్తు బుకింగ్స్ లో భారతదేశం అంతటా 2.5 లక్షల టిక్కెట్లను విక్రయించింది. షారుఖ్ ఖాన్ జవాన్ (1.5 లక్షలు), రణ్ వీర్ సింగ్ యొక్క ధురంధర్ 2 (1.3 లక్షలు), రణబీర్ కపూర్ యొక్క యానిమల్ (55 వేలు) వంటి బ్లాక్ బస్టర్లను అధిగమించిన ఈ బ్రేక్ నెక్ పేస్ భారతీయ సినిమా చరిత్రలో ఉత్తమమైనది. టాక్సిక్ యొక్క హిందీ వెర్షన్ మాత్రమే యానిమల్ ను ఓడించింది, 24 గంటల్లో 60 కె టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన 'ఆల్ అబౌట్ టాక్సిక్ టాక్సిక్' చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుటారియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు ౨౬ న థియేటర్లలో విడుదల కానుంది. టాక్సిక్ దాని ఆవిరి, సన్నిహిత సన్నివేశాలు మరియు సన్నివేశాల కోసం వార్తల్లో ఉంది, ఇవి చిత్రాలు మరియు సంభాషణల ద్వారా మహిళలను అంత అనుకూలమైన వెలుగులో చూపించినట్లు కనిపిస్తాయి. ఈ చిత్రాన్ని సిబిఎఫ్ సి ఎటువంటి కోతలు మరియు ఎ-రేటింగ్ లేకుండా క్లియర్ చేసింది.