Accident In Toxic Pre Release Event Yash Reaction: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం (ఆగస్ట్ 22) హైదరాబాద్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుల్లపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
సౌండ్ బాక్స్ స్టాండ్ కూలి అభిమానులకు తీవ్ర గాయాలు

వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో సభ జరుగుతుండగా ఒక ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా వేదికపై ఉన్న దృశ్యాలను స్పష్టంగా చూడటం కోసం కొందరు అభిమానులు భారీ ఫ్లయింగ్ డీజే స్పీకర్ స్టాండ్ పైకి ఎక్కారు.
అంతేకాకుండా దానిపై నిలబడి కొందరు స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఓవర్ లోడ్ కావడంతో ఆ భారీ సౌండ్ బాక్స్ సెట్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. పైనుంచి కిందపడటంతో ఇద్దరు వ్యక్తులకు కాళ్లు విరిగిపోగా, మరో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి.
వీడియోలు వైరల్
ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా తోక్కిసలాట వాతావరణం నెలకొంది. అలర్ట్ అయిన సైబరాబాద్ పోలీసులు, నిర్వాహకులు గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రసంగాన్ని ఆపేసి సాయం కోరిన హీరో యశ్
అయితే, టాక్సిక్ ఈవెంట్ స్టేజ్‌పై మైక్ పట్టుకుని అభిమానులను ఉద్దేశించి హీరో యశ్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సౌండ్ బాక్స్ కూలిపోవడం చూసిన యశ్ వెంటనే తన స్పీచ్‌ను మధ్యలోనే ఆపేసి గాయపడ్డ వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
"అక్కడ ఉన్నవారికి ఏమైనా అయిందా? ముందుగా వారిని వెళ్లి చూడండి. గాయపడిన వారికి సాయం అందించండి" అని నిర్వాహకులకు యశ్ వేదికపై నుంచే సూచించారు. అనంతరం మైదానంలో ఉన్న ఇతర స్పీకర్ స్టాండ్ల పైకి కూడా కొంతమంది అభిమానులు ఎక్కేందుకు ప్రయత్నించడం గమనించిన యశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాణాలకంటే ఏది ఎక్కువ కాదు
{{/usCountry}}"అక్కడ ఉన్నవారికి ఏమైనా అయిందా? ముందుగా వారిని వెళ్లి చూడండి. గాయపడిన వారికి సాయం అందించండి" అని నిర్వాహకులకు యశ్ వేదికపై నుంచే సూచించారు. అనంతరం మైదానంలో ఉన్న ఇతర స్పీకర్ స్టాండ్ల పైకి కూడా కొంతమంది అభిమానులు ఎక్కేందుకు ప్రయత్నించడం గమనించిన యశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాణాలకంటే ఏది ఎక్కువ కాదు
{{/usCountry}}ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని, దయచేసి కిందకి దిగాలని అభిమానులను వేడుకున్నారు యశ్. అక్కడ వాతావరణం ప్రశాంతంగా మారిన తర్వాతే యశ్ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రికార్డు స్థాయి బుకింగ్స్‌తో 'టాక్సిక్' హవా!
ఇదిలా ఉంటే, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ వంటి భారీ తారగణం నటిస్తోంది.
విడుదలకు ముందే టాక్సిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న టాక్సిక్ సినిమా ముందస్తు బుకింగ్స్ ఆరంభమైన మొదటి రోజే రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి రికార్డు నెలకొల్పింది.
ప్రేమ, ప్రతికారం
తండ్రీకొడుకుల అనుబంధం, ప్రేమ, ప్రతికారం నేపథ్యంలో తెరకెక్కిన టాక్సిక్ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో, మూడు డిఫరెంట్ గెటప్పులతో యశ్ ఏ విధంగా అట్రాక్ట్ చేస్తాడో వేచి చూడాలి.