బుల్లితెరపై సరికొత్త ప్రయోగానికి తెరలేపుతూ వచ్చిన రియాలిటీ షో 'ది 50'. గత బిగ్ బాస్, రోడీస్, స్ల్పిట్స్ విల్లా పాల్గొన్న కంటెస్టెంట్లతో నిండిపోయిన ది 50 షో కేవలం డ్రామాతోనే కాదు.. ఇప్పుడు కాస్టింగ్ వివాదంతోనూ వార్తల్లో నిలుస్తోంది. ఈ షో నుంచి మొదటి కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన వన్షజ్ సింగ్‌తో యూట్యూబర్ శ్రేయ కల్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ప్రిన్స్ సిఫార్సు ఉంటేనే ఎంపిక?

ది 50 షోలో పాల్గొనే అవకాశం తనకు కూడా వచ్చిందని యూట్యూబర్ శ్రేయ కల్రా వెల్లడించారు. "షో మేకర్స్ నాతో మాట్లాడినప్పుడు.. నీ స్నేహితులను కూడా తీసుకురావచ్చు, కానీ ముందే వారి పేర్లు చెప్పాలని అన్నారు. ఆ పేర్లను బట్టి ఎవరిని తీసుకోవాలో వారు నిర్ణయిస్తారు" అని శ్రేయ కల్రా పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రస్తుతం షోలో ఉన్న కంటెస్టెంట్లలో చాలామంది ప్రిన్స్ నరులా సిఫార్సుతోనే వచ్చారని శ్రేయ కల్రా ఆరోపించారు. దీనిపై వన్షజ్ సింగ్ స్పందిస్తూ.. "ఇది వంద శాతం నిజం. ప్రిన్స్ రికమండ్ చేయకపోతే అక్కడ ఉన్న సగం మందికి పనే దొరకదు" అని వ్యాఖ్యానించారు.
నెటిజన్ల ఫైర్: ‘ఇదొక గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్’
ఈ వీడియో క్లిప్ రెడ్డిట్ (Reddit) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిని 'గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్' అని, 'ఎమ్ఎల్ఎమ్ (MLM) స్కీమ్' అని ఎద్దేవా చేస్తున్నారు. "అందుకేనేమో అక్కడ ఉన్న సగం మంది పేర్లు మాకు తెలియడం లేదు.. అంతా మాస్ రిక్రూట్‌మెంట్‌లా ఉంది" అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
అసలేమిటి ఈ 'ది 50'?
రియాలిటీ టెలివిజన్ రంగంలో మార్పు తెస్తామని ప్రకటించిన ఈ షోలో కరణ్ పటేల్, రిధి డోగ్రా, ప్రిన్స్ నరులా, ఉర్వశి ధోలాకియా వంటి సీనియర్ నటులతో పాటు ఫైజు షేక్, అద్నాన్ షేక్, లవకేష్ కటారియా వంటి పాపులర్ యూట్యూబర్లు కూడా ఉన్నారు. నిక్కీ తంబోలి, రజత్ దలాల్ వంటి రియాలిటీ షో రెగ్యులర్ కంటెస్టెంట్లు కూడా ఇందులో సందడి చేస్తున్నారు.
{{/usCountry}}రియాలిటీ టెలివిజన్ రంగంలో మార్పు తెస్తామని ప్రకటించిన ఈ షోలో కరణ్ పటేల్, రిధి డోగ్రా, ప్రిన్స్ నరులా, ఉర్వశి ధోలాకియా వంటి సీనియర్ నటులతో పాటు ఫైజు షేక్, అద్నాన్ షేక్, లవకేష్ కటారియా వంటి పాపులర్ యూట్యూబర్లు కూడా ఉన్నారు. నిక్కీ తంబోలి, రజత్ దలాల్ వంటి రియాలిటీ షో రెగ్యులర్ కంటెస్టెంట్లు కూడా ఇందులో సందడి చేస్తున్నారు.
{{/usCountry}}ఒక పెద్ద రాజభవనంలో ఉండే కంటెస్టెంట్లు, ప్రతిరోజూ టాస్కులు గెలిచి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలి. 'ది లయన్' అనే ఒక అజ్ఞాత శక్తి ఈ క్రీడను నడిపిస్తుంది. ప్రస్తుతం ది 50 షో జియో హాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు కలర్స్ ఛానెల్‌లో ది 50 షో టీవీ ప్రీమియర్ అవుతోంది.