బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. కూల్డ్రింకులకు బదులు డైట్ సోడాలు తాగడం, మైదా బిస్కెట్ల స్థానంలో నట్స్ తినడం, ప్లేట్ నిండా సలాడ్లు తీసుకోవడం వంటివి చేస్తారు. అయినప్పటికీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంటారు. "ఇంత పత్యం ఉంటున్నా బరువు ఎందుకు తగ్గడం లేదు?" అని మీకు అనిపిస్తుంటే.. మీకు తెలియకుండానే క్యాలరీల పరిమాణాన్ని పెంచే కొన్ని చిన్న చిన్న అలవాట్లను మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. మనం తీసుకునే పరిమాణం, వండే పద్ధతులు, ప్లేట్లో ఏ పదార్థం ఎంత ఉందనేది కూడా అంతే ముఖ్యం. న్యూట్రిషన్, మెటబాలిక్ హెల్త్ స్పెషలిస్ట్ తనయ్ మాందోవరా తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గకుండా అడ్డుపడే 5 ప్రధాన అలవాట్లు, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇక్కడ చూద్దాం.
డైట్ సోడాలు సురక్షితం అనుకోవడం..
చక్కెర డ్రింకులతో పోలిస్తే డైట్ సోడాలలో క్యాలరీలు, పంచదార ఉండవు కాబట్టి ఇవి పూర్తిగా సురక్షితమని భావిస్తారు. పంచదారను తగ్గించుకోవడానికి ఇవి తాత్కాలికంగా ఉపయోగపడినప్పటికీ, వీటిని రోజువారీ తాగునీటికి ప్రత్యామ్నాయంగా మార్చుకోకూడదు. ఇవి పదే పదే తీపి పదార్థాలపై కోరికలను ప్రేరేపిస్తాయి.
ఏం చేయాలి?: మంచి నీటినే ప్రధాన పానీయంగా ఉపయోగించాలి. తీపి లేని మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు వంటివి శ్రేయస్కరం. డైట్ సోడాలను అప్పుడప్పుడు మాత్రమే తాగాలి.
వంట నూనె వాడకాన్ని అంచనా వేయకపోవడం..
వంటల్లో నూనెను చాలా చిన్న పదార్థంగా పరిగణిస్తారు. కానీ నూనెలో క్యాలరీల సాంద్రత చాలా ఎక్కువ. మన భారతీయ వంటకాల్లో పోపు, కూరల గ్రేవీలు, వేపుళ్ల కోసం నూనెను విరివిగా వాడతారు. కూరగాయలు, పప్పు ధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, వాటిలో ఎక్కువ నూనె చేరడం వల్ల భోజనం క్యాలరీ బాంబులా మారుతుంది.
ఏం చేయాలి?: వంట చేసేటప్పుడు నూనెను సీసా నుంచి నేరుగా పొయ్యకుండా స్పూన్‌తో కొలిచి వాడాలి. వేయించడం కంటే గ్రిల్లింగ్, స్టీమింగ్, రోస్టింగ్ పద్ధతులను ఎంచుకోవడం మంచిది.
ప్లేట్ నిండా చపాతీలు, అన్నమే ఉండటం..
{{/usCountry}}ఏం చేయాలి?: వంట చేసేటప్పుడు నూనెను సీసా నుంచి నేరుగా పొయ్యకుండా స్పూన్‌తో కొలిచి వాడాలి. వేయించడం కంటే గ్రిల్లింగ్, స్టీమింగ్, రోస్టింగ్ పద్ధతులను ఎంచుకోవడం మంచిది.
ప్లేట్ నిండా చపాతీలు, అన్నమే ఉండటం..
{{/usCountry}}మన తెలుగు ఇళ్లలో అన్నం, చపాతీ ప్రధాన ఆహారం. ఇవి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే అయినప్పటికీ, కేవలం పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండి ప్రోటీన్, ఫైబర్ తగ్గితే బరువు తగ్గడం కష్టమవుతుంది.
ఏం చేయాలి?: సమతుల్యాహారాన్ని ఎంచుకోవాలి. అన్నం లేదా రొట్టె పరిమాణాన్ని తగ్గించి.. దానికి సమానంగా పప్పు, బీన్స్, పెరుగు, పనీర్, గుడ్లు లేదా నాన్‌వెజ్ వంటి ప్రోటీన్ వనరులతో పాటు ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
హెవీ డ్రెస్సింగ్స్తో ఉన్న సలాడ్లు తినడం..
రెస్టారెంట్లు లేదా హోటళ్లలో సలాడ్ అనగానే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. కానీ అందులో వాడే క్రీమీ డ్రెస్సింగ్స్, మయోనైస్ సాస్‌లు, ఎక్కువ మొత్తంలో చీజ్, ఫ్రైడ్ టాపింగ్స్ వల్ల ఆ సలాడ్ సాధారణ భోజనం కంటే ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.
ఏం చేయాలి?: రకరకాల కూరగాయలతో పాటు శనగలు, పనీర్, టోఫు, గుడ్లు వంటి ప్రోటీన్ ఉన్న సలాడ్లను ఎంచుకోవాలి. సలాడ్ పై వేసే డ్రెస్సింగ్స్ లేదా సాస్‌లను విడిగా ఇవ్వమని కోరి, అవసరమైనంత మాత్రమే వాడుకోవాలి.
నట్స్‌ను విచ్చలవిడిగా తినడం!
బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తాల్లో శరీరానికి మేలు చేసే కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ, వీటిలో క్యాలరీలు చాలా ఎక్కువ. డబ్బా లేదా ప్యాకెట్ నుంచి నేరుగా తీసుకుంటూ రోజంతా కొద్దికొద్దిగా తింటూ ఉంటే.. మనకు తెలియకుండానే భారీగా క్యాలరీలు శరీరంలోకి చేరతాయి.
ఏం చేయాలి?: ప్యాకెట్ నుంచి నేరుగా తినకుండా ఒక చిన్న గిన్నెలో గుప్పెడు మాత్రమే వేసుకుని తినాలి. ఉప్పు వేయని, ప్రాసెస్ చేయని సహజసిద్ధమైన నట్స్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం.