మనలో చాలా మందికి ఉదయాన్నే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఫిట్‌నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారు పాలు, చక్కెర లేకుండా కేవలం బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఈ రెండు కూడా అదనపు క్యాలరీలను కట్ చేసి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం? వేటికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. బ్లాక్ కాఫీ ప్రత్యేకతలు అండ్ లాభాలు..

బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.
ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్: "బ్లాక్ కాఫీలో కెఫిన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జిమ్‌లో వర్కవుట్ చేయడానికి లేదా ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు తక్షణ శక్తిని, ఏకాగ్రతను ఇస్తుంది," అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇది బెస్ట్ ప్రీ-వర్కవుట్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది.
మధుమేహం, ఊబకాయం దూరం: 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ' ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగే వారిలో ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
2. బ్లాక్ టీ ప్రత్యేకతలు అండ్ లాభాలు..
బ్లాక్ కాఫీతో పోలిస్తే బ్లాక్ టీలో కెఫిన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కెఫిన్ ఎక్కువగా వద్దు అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
బరువు తగ్గడం : 'ఫ్రాంటియర్స్ ఇన్ జెనెటిక్స్' అధ్యయనం ప్రకారం.. బ్లాక్ టీ క్రమంగా తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారని తేలింది. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ అసలు ఉండదు.
రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం: ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను (గట్ హెల్త్) మెరుగుపరచడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
{{/usCountry}}రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం: ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను (గట్ హెల్త్) మెరుగుపరచడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
{{/usCountry}}Green Tea vs Black Coffee : బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్? గ్రీన్ టీనా.. బ్లాక్ కాఫీనా?
మరి రెండింటిలో ఏది బెస్ట్? మీరు దేన్ని ఎంచుకోవాలి?
మీరు ఆశించే ఆరోగ్య ప్రయోజనాలను బట్టి మీ డ్రింక్‌ను ఎంచుకోవాలి:
అలర్ట్‌నెస్ అండ్ ఎనర్జీ కావాలంటే: ఉదయాన్నే బద్ధకం వదిలి యాక్టివ్‌గా మారాలన్నా, జిమ్‌కు వెళ్లాలన్నా బ్లాక్ కాఫీ బెస్ట్ ఆప్షన్.
ఫిట్‌నెస్ అండ్ బరువు తగ్గాలంటే: కెఫిన్ మోతాదు తక్కువగా ఉంటూ, గుండె, జీర్ణక్రియ బాగుండాలంటే బ్లాక్ టీ బెస్ట్ ఆప్షన్.
నిపుణుల సూచనలు..
"హైపర్ టెన్షన్ (బీపీ) సమస్య ఉన్నవారు బ్లాక్ కాఫీకి దూరంగా ఉండాలి. అలాగే, రాత్రి పూట నిద్రలేమి సమస్య రాకుండా ఉండాలంటే.. సాయంత్రం వేళల్లో ఎవరూ కూడా బ్లాక్ కాఫీ తీసుకోకూడదు," అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న చిట్కా: ఈ రెండింటిని మరింత హెల్తీగా మార్చడానికి కొద్దిగా నెయ్యి కలిపి ‘ఘీ టీ’ లేదా ‘ఘీ కాఫీ’గా కూడా తీసుకోవచ్చు అని మర్చిపోకండి.