Green Tea vs Black Tea For Weight Loss : ఉదయాన్నే ఒక కప్పు వేడి టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే సాధారణ పాలు, చక్కెర టీల కంటే 'గ్రీన్ టీ' లేదా ‘బ్లాక్ టీ’ తాగడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రెండూ ఒకే మొక్క నుంచి వచ్చినప్పటికీ.. ఆకులను సేకరించిన తర్వాత బ్లాక్ టీ ఆకులను మొదట రోల్ చేసి, ఆపై ఆక్సిడైజేషన్ (గాలికి గురి చేయడం) ప్రక్రియకు గురి చేస్తారు. దీనివల్ల ఆకులు నల్లగా మారతాయి. గ్రీన్ టీ విషయంలో ఎలాంటి ఆక్సిడైజేషన్ జరగదు, అందుకే ఆకులు ఆకుపచ్చగానే ఉంటాయి.

ఈ రెండింటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి మధ్య ఉన్న తేడాల లోతైన విశ్లేషణ ఇక్కడ చూద్దాము..
గ్రీన్ టీ, బ్లాక్ టీల సమాన ప్రయోజనాలు..
1. గుండె ఆరోగ్యానికి రక్షణ
ఈ రెండు టీలలోనూ ‘పాలిఫెనాల్స్’ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి.
బ్లాక్ టీ: 2021, 2022లో జరిగిన అధ్యయనాల ప్రకారం, గ్రీన్ టీ కంటే బ్లాక్ టీలోనే ‘ఫ్లేవనాయిడ్స్’ (యాంటీఆక్సిడెంట్స్) శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల బ్లాక్ టీ తాగడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
గ్రీన్ టీ: 2023 పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
2. మెదడు పనితీరు పెంపు
రెండింటిలోనూ కెఫిన్ అనే ఉద్దీపన పదార్థం ఉంటుంది. ప్రతి 100 గ్రాముల గ్రీన్ టీలో 12 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటే, బ్లాక్ టీలో 11 మిల్లీగ్రాములు ఉంటుంది. పరిమిత మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, అలసట తగ్గుతుంది, డిప్రెషన్ (మానసిక కుంగుబాటు) ముప్పు తగ్గుతుంది.
ఎల్-థియానిన్ : కాఫీలో లేని ‘ఎల్-థియానిన్’ అనే అమైనో ఆమ్లం ఈ రెండు టీలలోనూ ఉంటుంది. ఇది మెదడులో 'గాబా' అనే న్యూరోట్రాన్స్మిటర్ను విడుదల చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతూనే అలర్ట్‌గా ఉండేలా చేస్తుంది. ఇది మూడ్‌ను మెరుగుపరిచే 'డోపమైన్' హార్మోన్‌ను కూడా పెంచుతుంది. బ్లాక్ టీ కంటే గ్రీన్ టీలో ఈ ఎల్-థియానిన్ కాస్త ఎక్కువగా ఉంటుంది.
{{/usCountry}}ఎల్-థియానిన్ : కాఫీలో లేని ‘ఎల్-థియానిన్’ అనే అమైనో ఆమ్లం ఈ రెండు టీలలోనూ ఉంటుంది. ఇది మెదడులో 'గాబా' అనే న్యూరోట్రాన్స్మిటర్ను విడుదల చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతూనే అలర్ట్‌గా ఉండేలా చేస్తుంది. ఇది మూడ్‌ను మెరుగుపరిచే 'డోపమైన్' హార్మోన్‌ను కూడా పెంచుతుంది. బ్లాక్ టీ కంటే గ్రీన్ టీలో ఈ ఎల్-థియానిన్ కాస్త ఎక్కువగా ఉంటుంది.
{{/usCountry}}3. గట్ హెల్త్ : గ్రీన్ టీ, బ్లాక్ టీలు రెండూ కూడా ప్రీబయోటిక్‌గా పని చేసి గట్ హెల్త్ మెరుగుపడటానికి ఉపయోగపడతాయి. వీటి వల్ల కడుపులోని గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది.
4. వెయిట్ లాస్ : ఈ రెండు టీలు కూడా శరీర మెటబాలిజంను పెంచి, క్యాలరీలను బాగా అబ్సార్బ్ప్షన్ని తగ్గించి మీరు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
Green Tea vs Black Coffee : బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్? గ్రీన్ టీనా.. బ్లాక్ కాఫీనా?
ముఖ్యమైన వ్యత్యాసాలు..
- గ్రీన్ టీలోని ‘ఈజీసీజీ’ పవర్ హౌస్
గ్రీన్ టీలో ‘ఎపిగాలోకాటెచిన్-3-గాలెట్’ (ఈజీసీజీ) అనే అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఒక కప్పు గ్రీన్ టీ ద్వారా 200 నుంచి 300 మిల్లీగ్రాముల ఈజీసీజీ లభిస్తుంది.
ఇది శరీరంలో ట్యూమర్లు, క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది.
పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది.
కాలేయం (లివర్) చెడిపోకుండా రక్షిస్తుంది, వాపులను (యాంటీ ఇన్ఫ్లమేషన్) తగ్గిస్తుంది.
2. బ్లాక్ టీలోని ‘థియాఫ్లేవిన్స్’
ఆక్సిడైజేషన్ ప్రక్రియ కారణంగా బ్లాక్ టీలో మాత్రమే ‘థియాఫ్లేవిన్స్’ అనే ప్రత్యేకమైన పాలిఫెనాల్స్ ఏర్పడతాయి. ఇవి మొత్తం యాంటీఆక్సిడెంట్లలో 3 నుంచి 6 శాతం వరకు ఉంటాయి.
ఇవి శరీరంలోని కొవ్వు కణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల దెబ్బతినకుండా కాపాడతాయి.
3. ఊబకాయం రాకుండా చూస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను, యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు ఇవి మేలు చేస్తాయి.
గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ.. ఏది తీసుకోవాలి?
ఈ రెండింటిలో ఏది "అత్యంత ఆరోగ్యకరమైనది" అని అడిగితే.. ఖచ్చితమైన సమాధానం లేదు. యాంటీఆక్సిడెంట్ కెపాసిటీ పరంగా గ్రీన్ టీ కొంచెం ముందున్నట్లు 2017 నాటి కొన్ని పరిశోధనలు చెబుతున్నప్పటికీ, బ్లాక్ టీ వల్ల వచ్చే లాభాలు తక్కువేమీ కావు. మీ రుచి ప్రాధాన్యతను బట్టి మీరు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలలో దేనినైనా ఎంచుకోవచ్చు. మీ రోజువారీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.