Weight loss : రోజుకు నాలుగు పూటలు తింటూనే 45 కేజీలు తగ్గిన మహిళ! ఇలా..

కఠినమైన ఉపవాసాలు చేయకుండా, రోజూ పౌష్టికాహారం తింటూనే 10 నెలల్లో 45 కిలోలకు పైగా బరువు తగ్గింది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ సాక్షి సింగ్. 115 కిలోల నుంచి 70 కిలోలకు తగ్గిన ఆమె హెల్తీ డైట్ ప్లాన్, కేలరీ డెఫిసిట్ చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 8, 2026, 07:31:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బరువు తగ్గడం అనగానే చాలామంది గంటల తరబడి వర్కౌట్లు చేయడం, అస్సలు తిండి తినకపోవడం అని పొరబడుతుంటారు. కానీ శారీరక వ్యాయామం కంటే కూడా మనం తీసుకునే ఆహారం, కేలరీల పరిమితి మాత్రమే వేగంగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గేలా చేస్తుందని నిరూపించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ సాక్షి సింగ్!

115 నుంచి 70కి వచ్చిన సాక్షి.. ఎలా సాధ్యం?
115 నుంచి 70కి వచ్చిన సాక్షి.. ఎలా సాధ్యం?

ఒకప్పుడు 115 కిలోల బరువు ఉన్న సాక్షి సింగ్ కేవలం 10 నెలల వ్యవధిలోనే ఏకంగా 45 కిలోలకు పైగా తగ్గి ప్రస్తుతం 70 కిలోల ఆరోగ్యకరమైన రూపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన బరువు తగ్గే ప్రయాణంలో రోజూ ఎలాంటి ఆహారం తీసుకున్నారో సోషల్ మీడియా వేదికగా సమగ్ర వివరాలను వెల్లడించారు.

కేలరీ డెఫిసిట్ అంటే ఏంటి?

మనం రోజువారీ కార్యకలాపాలకు ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడాన్నే 'కేలరీ డెఫిసిట్' అంటారు. సాక్షి తన వెయిట్ లాస్ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆమె శరీరానికి అవసరమైన మెయింటెనెన్స్ కేలరీలు 2,800గా ఉండేవి. బరువు తగ్గే కొద్దీ శరీర తత్వానికి అనుగుణంగా కేలరీల పరిమితి మారుతుంటుంది. అందుకే ఆమె రోజుకు 1,400 నుంచి 1,700 కేలరీలు మాత్రమే తీసుకుంటూ, కనీసం 500 కేలరీల డెఫిసిట్‌ను నిలబెట్టుకున్నారు. అలాగే రోజువారీ ఆహారంలో 85 నుంచి 120 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరిగా ఉండేలా చూసుకున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు డైట్ ప్లాన్..

ఉదయాన్నే పరగడుపున:

రోజును బ్లూ టీ, జీలకర్ర-వాము నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ, తేనె కలిపిన పానీయంతో ప్రారంభించేవారు.

అల్పాహారం (ఉదయం 8 గంటలకు):

అల్పాహారంలో 300 నుంచి 450 కేలరీలు, 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ ఉండేలా ప్రణాళిక చేసుకున్నారు. రోజు ఒకే రకమైన ఆహారం తినకుండా మార్చి మార్చి తీసుకోవడం వల్ల డైట్ సులువవుతుందని ఆమె తెలిపారు.

  • లో-ఫ్యాట్ పన్నీర్ స్టఫింగ్‌తో చేసిన పెసరపప్పు (మూంగ్ దాల్) చీలా లేదా శనగపిండి (బేసన్) చీలా
  • పన్నీర్ లేదా మూంగ్ దాల్ ఉప్మా
  • పెసరపప్పు ఇడ్లీ, మూంగ్‌లెట్
  • పన్నీర్ తురుముతో చేసిన రాగి దోస
  • పన్నీర్ ముక్కలతో కూడిన వెజిటబుల్ మసాలా ఓట్స్

మధ్యాహ్న భోజనం :

మధ్యాహ్న భోజనంలో 400 నుంచి 650 కేలరీలు, 25 నుంచి 50 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకున్నారు.

  • పనీర్‌తో చేసిన బ్రౌన్ రైస్ మూంగ్‌దాల్ కిచిడీ
  • జొన్న రొట్టె లేదా గోధుమ తౌడు రొట్టెతో సోయా మటర్ సబ్జీ
  • రొట్టెతో మసూర్ దాల్ లేదా పాలకూర పప్పు
  • ఆయిల్, నెయ్యి లేకుండా వండిన పనీర్ లేదా చికెన్

అంతేకాదు, జీర్ణక్రియ మెరుగుపడటానికి, ఫైబర్ కోసం కీరా, క్యారట్, ఉల్లిపాయలతో కూడిన సలాడ్ తప్పనిసరిగా తినేవారు.

సాయంత్రం స్నాక్స్ :

సాయంత్రం ఆకలేసినప్పుడు కేవలం 100 నుంచి 200 కేలరీల లోపే తీసుకునేవారు. ఏదైనా ఒక పండు, ఖాక్రా, ఉడకబెట్టిన శనగలు, మఖానా లేదా గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేవారు.

రాత్రి భోజనం :

  • రాత్రి వేళ 200 నుంచి 400 కేలరీలు, 10 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకునేవారు.
  • వేగించిన కూరగాయలతో పన్నీర్ లేదా చికెన్ క్లియర్ సూప్
  • పెసరపప్పు వెజిటబుల్ సూప్ లేదా లెమన్ కొరియాండర్ సూప్
  • ఆకలి ఎక్కువగా ఉన్న రోజుల్లో పాలకూర పప్పుతో ఒక గోధుమ రొట్టె ఎంచుకునేవారు.

12 గంటల నైట్‌టైమ్ ఫాస్టింగ్..

రాత్రి భోజనం త్వరగా ముగించిన తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు కనీసం 12 గంటల పాటు నైట్‌టైమ్ ఫాస్టింగ్​ని సాక్షి పాటించేవారు.

ఆంక్షలతో కూడిన డైటింగ్ కాకుండా, మన దినచర్యలో భాగమయ్యే ఆహారపు అలవాట్లను ఎంచుకున్నప్పుడే సుదీర్ఘకాలం బరువును నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందని సాక్షి సింగ్ నిరూపించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More