...
...
Next Story

షాకింగ్​! తల్లి ప్రైవేట్​ ఫొటోలు తీసి.. ప్రియుడికి పంపించిన మహిళ

బెంగళూరులో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది! ఓ మహిళ, తన తల్లి ప్రైవేట్​ ఫొటోలను తీసింది. అనంతరం వాటిని తన ప్రియుడికి పంపించింది. మరో బంధువు ఫొటోలు, వీడియోలను కూడా ఈ విధంగానే షేర్​ చేసింది!

Published on: Feb 9, 2026, 13:28:46 IST
Advertisement

కర్ణాటక రాజధాని బెంగళూరులో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కన్నతల్లిని దేవతలా పూజించాల్సిన కూతురు.. ప్రియుడి మాటలు నమ్మి అమ్మకే ద్రోహం చేసింది! తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రైవేట్ ఫోటోలు తీసి, తన ప్రియుడికి పంపించింది.

అసలేం జరిగిందంటే..

తల్లి ప్రైవేట్​ ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళ! (AI image)
తల్లి ప్రైవేట్​ ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళ! (AI image)

బెంగళూరు మైసూరు రోడ్ సమీపంలో నివసిస్తున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో ఈ ఘటన జరిగింది. 49 ఏళ్ల బాధితురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె బీబీఏ పూర్తి చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉంది. చదువు, ఉద్యోగ ప్రయత్నాల కోసం స్మార్ట్‌ఫోన్ కావాలని తండ్రిని కోరడంతో, వారు ఆమెకు ఫోన్ కొనిచ్చారు. అయితే, అదే ఫోన్ ఆమెను దారి తప్పేలా చేస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు.

ఫోన్ సీక్రెట్‌ బయటపడింది ఇలా..

సుమారు నెల రోజుల క్రితం, తల్లి ఇంట్లో పని చేసుకుంటూ తన పెద్ద కూతురు గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో కూతురు ఎవరో తెలియని వ్యక్తితో వీడియో కాల్‌లో ఉండటం గమనించింది. తల్లిని చూడగానే కూతురు హఠాత్తుగా కాల్ కట్ చేయడంతో అనుమానం వచ్చిన తల్లి ఆమెను ప్రశ్నించింది. కానీ ఆమె సమాధానం దాటవేసింది. ఫోన్ పాస్‌వర్డ్ కూడా చెప్పకపోవడంతో అనుమానం బలపడి, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమెను నిలదీశారు.

షాకింగ్ నిజాలు వెలుగులోకి..

చాలా సేపు ప్రశ్నించిన తర్వాత ఆ మహిళ తన తల్లికి తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పింది. ఫోన్‌ను తనిఖీ చేసిన తల్లికి గుండె ఆగినంత పనైంది!

కేవలం తనవే కాకుండా, ఇంటికి వచ్చిన తన అక్క (స్నానం చేస్తున్న సమయంలో తీసిన) నగ్న వీడియోలు కూడా ఫోన్​లో​ కనపడటం చూసి ఆ 49ఏళ్ల మహిళ షాక్​ అయ్యింది.

ఈ ఫోటోలు, వీడియోలన్నీ వరుణ్ అలియాస్ గిరిధర్ అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లు తేలింది. వరుణ్ కోరడం వల్లే తానూ ఇలా చేశానని ఆ మహిళ ఒప్పుకుంది.

ఇంటి నుంచి వెళ్లిపోయి.. ఆపై పెళ్లి

ఇది జరిగిన కొన్ని రోజులకు.. సదరు మహిళ ఇంటి నుంచి పారిపోయి అదే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు సమాచారం.

తమ ప్రైవేట్ ఫోటోలు దుర్వినియోగం అవుతాయేమోనని బాధితులు ఆందోళన చెందారు. అదే సమయంలో వరుణ్ అలియాస్ గిరిధర్​ గురించి ఏమీ తెలియకపోవడంతో తమ కూతురి క్షేమసమాచారలపై ఆవేదనకు గురయ్యారు.

అనంతరం వారు పోలీసులను సంప్రదించారు.

ప్రస్తుతం పోలీసులు ఐటీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks