Electric scooters : రూ. 74వేల నుంచి రూ. 1.5లక్షల వరకు- ఇండియాలో టాప్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవి..

Best electric scooters in 2026 : భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ శరవేగంగా మారుతోంది. మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, అదిరిపోయే రేంజ్, స్మార్ట్ ఫీచర్లతో 2026లో ఈవీ ప్రియుల కోసం అందుబాటులో ఉన్న టాప్ ఆప్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం..

Published on: Mar 30, 2026, 07:30:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగం ఊహించని వేగంతో విస్తరిస్తోంది. బ్యాటరీ టెక్నాలజీలో వచ్చిన మార్పులు, ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం (రేంజ్), స్మార్ట్ ఫీచర్లు, పోటీ ధరల వల్ల 2026 సంవత్సరం ఈవీ కొనుగోలుదారులకు అత్యంత ఉత్సాహభరితంగా మారింది! మీరు పెట్రోల్ వాహనం నుంచి ఎలక్ట్రిక్ వాహనానికి మారాలని ఆలోచిస్తుంటే, ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్​ల ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల సమగ్ర జాబితా, వాటి ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి.

హీరో విడా ఎలక్ట్రిక్​ స్కూటర్​..
హీరో విడా ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఇండియాలో ఉన్న టాప్​ 6 ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

ఏ. ఏథర్ 450ఎస్​..

  • ఎక్స్​షోరూం ధర: రూ. 1.23 లక్షలు నుంచి రూ. 1.58 లక్షలు
  • బ్యాటరీ ప్యాక్: 2.9 kWh, 3.7 kWh
  • మోటార్ పవర్: 5.4 kW
  • రేంజ్: 161 కి.మీ. వరకు

పవర్, పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఏథర్ 450ఎస్​ ఫేవరెట్. టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కూడిన డీప్‌వ్యూ ఎల్‌సీడీ కన్సోల్ దీని ప్రత్యేకత. ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి భద్రతా ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. 90 కి.మీ గరిష్ట వేగంతో దూసుకుపోయే ఈ స్కూటర్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

బీ. రివర్ ఇండీ..

  • ఎక్స్​షోరూం ధర: రూ. 1.42 లక్షలు
  • బ్యాటరీ ప్యాక్: 4 kWh
  • మోటార్ పవర్: 6.7 kW
  • రేంజ్: 161 కి.మీ వరకు

రఫ్ అండ్ టఫ్ డిజైన్‌తో వచ్చే ఈ రివర్ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్ ఒక 'మల్టీ-యూటిలిటీ' వాహనంలా ఉంటుంది. 14- ఇంచ్ పెద్ద వీల్స్, వెడల్పాటి టయర్లు రోడ్డుపై మంచి గ్రిప్‌ను ఇస్తాయి. ఎకో, రైడ్, రష్ అనే మూడు మోడ్స్‌తో పాటు ఇందులో ఉన్న మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్లు దీనిని ఒక ప్రాక్టికల్ మొబిలిటీ టూల్‌గా మార్చాయి.

సీ. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్​టీ..

  • ఎక్స్​షోరూం ధర: రూ. 1.28 లక్షలు నుంచి రూ. 1.59 లక్షలు
  • బ్యాటరీ ప్యాక్: 3.5 kWh, 5.3 kWh
  • మోటార్ పవర్: 4.4 kW
  • రేంజ్: 212 కి.మీ. వరకు

ఎక్కువ దూరం ప్రయాణించడమే మీ ప్రాధాన్యత అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్​టీ తిరుగులేని ఆప్షన్. 212 కి.మీల భారీ రేంజ్‌తో ఇది సెగ్మెంట్లోనే అత్యంత ప్రాక్టికల్ స్కూటర్‌గా నిలుస్తోంది. 7- ఇంచ్ టచ్‌స్క్రీన్, మ్యూజిక్ కంట్రోల్, స్మార్ట్ నోటిఫికేషన్లు, పార్క్ అసిస్ట్, యాంటీ-థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు టెక్ ప్రియులను ఆకట్టుకుంటాయి.

డీ. బజాజ్ చేతక్..

  • ఎక్స్​షోరూం ధర: రూ. 91,399 నుంచి 1.40 లక్షలు
  • వేరియంట్లు: సీ2501, 3001, 3501, 3502, 3503
  • బ్యాటరీ ప్యాక్: 2.5 kWh, 3.0 kWh, 3.5 kWh
  • మోటార్ పవర్: 4.2 kW
  • రేంజ్: 153 కి.మీ వరకు

పాత తరం ఐకానిక్ చేతక్ వారసత్వాన్ని కొనసాగిస్తూనే, ఆధునిక స్మార్ట్ ఫీచర్లతో బజాజ్ చేతక్ అలరిస్తోంది. 5- ఇంచ్​ టీఎఫ్​టీ టచ్‌స్క్రీన్, యాప్ ఇంటిగ్రేషన్, ఫుల్-ఎల్ఈడీ లైటింగ్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. దీని ఆల్-మెటల్ బాడీ, స్మూత్ రైడింగ్ అనుభవం మన్నికను కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్.

ఈ. ఏథర్ రిజ్టా..

ఎక్స్​షోరూం ధర: రూ. 76,000 నుంచి రూ. 1.54 లక్షలు

వేరియంట్లు: S, Z

బ్యాటరీ ప్యాక్: 2.9 kWh, 3.7 kWh

మోటార్ పవర్: 4.3 kW

రేంజ్: 159 కి.మీ. వరకు

కుటుంబ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్ ఏథర్ రిజ్టా. దీని సీటు పొడవుగా ఉండటమే కాకుండా, స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ. 7- ఇంచ్ టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, నావిగేషన్, బ్లూటూత్ సౌకర్యం ఉన్నాయి. భద్రత కోసం స్కిడ్ కంట్రోల్, క్రాష్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉండగా.. ఆటో హోల్డ్, మ్యాజిక్ ట్విస్ట్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు దీనిని యూజర్ ఫ్రెండ్లీగా మార్చాయి.

ఎఫ్​. హీరో విడా వీఎక్స్​2..

ఎక్స్​షోరూం ధర: రూ. 99,490 నుంచి రూ. 1.1 లక్షలు

వేరియంట్లు: Go, Plus

బ్యాటరీ ప్యాక్: 2.2 kWh, 3.4 kWh

మోటార్ పవర్: 6 kW

రేంజ్: 142 కి.మీ వరకు

టాప్ స్పీడ్: గంటకు 80 కి.మీ

పట్టణ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణించే వారికి ఇది ఒక సమతుల్యమైన ఎంపిక. ఇందులో ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. 4.3- ఇంచ్ టీఎఫ్​టీ డిస్​ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. కేవలం ఒక గంటలోనే 0-80% ఛార్జింగ్ ఎక్కే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ పార్క్ మోడ్ అసిస్ట్ దీని ప్రత్యేకతలు. 5 ఏళ్ల బ్యాటరీ వారంటీతో పాటు 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' ప్లాన్ ద్వారా దీనిని సులభంగా సొంతం చేసుకోవచ్చు.

మీకు ఏది సెట్ అవుతుంది?

కుటుంబ అవసరాల కోసం ఏథర్ రిజ్టా, ఎక్కువ దూరం ప్రయాణించడానికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్​టీ, ఇక స్పీడ్, థ్రిల్ కావాలంటే ఏథర్ 450ఎస్​ లేదా సింపుల్ వన్ జెన్ 2ను ఎంచుకోవచ్చు. మీ రోజువారీ ప్రయాణం, బడ్జెట్, ఛార్జింగ్ సౌకర్యాన్ని బట్టి మీకు నచ్చిన స్కూటర్‌ను ఎంచుకోండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? మార్చాల్సి వస్తే ఖర్చు ఎంత ఉంటుంది?

సమాధానం: సాధారణంగా ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్లలో వాడుతున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం 5 నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. చాలా కంపెనీలు (ఉదాహరణకు హీరో విడా, ఏథర్) 5 ఏళ్ల వరకు వారంటీని కూడా అందిస్తున్నాయి. ఒకవేళ వారంటీ తర్వాత బ్యాటరీ మార్చాల్సి వస్తే, అది స్కూటర్ మొత్తం ధరలో సుమారు 30% నుంచి 40% వరకు ఉంటుంది. అయితే, సరిగ్గా మెయింటైన్ చేస్తే 7-8 ఏళ్ల వరకు బ్యాటరీ సామర్థ్యం తగ్గకుండా వాడుకోవచ్చు.

2. వర్షాకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ వాడటం సురక్షితమేనా? వాటర్ లాగింగ్ వల్ల బ్యాటరీ పాడవుతుందా?

సమాధానం: అవును, ఎలక్ట్రిక్ స్కూటర్లను వర్షంలో నడపడం పూర్తిగా సురక్షితం. ప్రస్తుత ఈవీ స్కూటర్లలోని బ్యాటరీ, మోటార్లకు ఐపీ67 రేటింగ్ ఉంటుంది. దీని అర్థం అవి ధూళి, నీటి నుంచి రక్షణ పొందుతాయి (సుమారు 30 నిమిషాల పాటు నీటిలో ఉన్నా ఏమీ కాదు). అయితే, మోకాళ్ల లోతు నీరు ఉన్న చోట ప్రయాణించకపోవడం మంచిది. అలాగే, స్కూటర్ తడిసిన తర్వాత ఛార్జింగ్ సాకెట్ పూర్తిగా ఆరిన తర్వాతే ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More