...
...
Next Story

CBSE exams : సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలు- టాపర్స్​ పాటించే ప్రిపరేషన్​ టిప్స్​ ఇవి..

సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు అనుసరించాల్సిన కొన్ని టిప్స్​ని ఇక్కడ వివరంగా తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతాయి.

Published on: Feb 8, 2026, 16:01:55 IST
Advertisement

సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​) బోర్డు పరీక్షలకు ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఫిబ్రవరి 17న సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అడ్మిట్​ కార్డులు ఇప్పటికే వచ్చేశాయి. సరైన అవగాహన లేకప్రిపరేషన్​లో విద్యార్థులు ఆందోళనకు గురవ్వడం సహజం. ఈ నేపథ్యంలో పదో తరగతి బోర్డ్ పరీక్షలంటే ఉండే భయాన్ని పోగొట్టుకుని, ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి కొన్ని ప్రిపరేషన్​ టిప్స్​ని ఇక్కడ ఇస్తున్నాము. వీటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి.

సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు- సబ్జెక్టుల వారీగా టిప్స్..

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ప్రిపరేషన్​ టిప్స్​ ఇవి..
సీబీఎస్​ఈ క్లాస్​ 10 ప్రిపరేషన్​ టిప్స్​ ఇవి..

1. సైన్స్

ప్రిన్సిపల్స్​ని అర్థం చేసుకోండి: కేవలం చదవడం కాకుండా, వాటి వెనుక ఉన్న థియరీలను అర్థం చేసుకోండి.

డయాగ్రామ్స్: బొమ్మలు గీయడం ప్రాక్టీస్ చేయండి, లేబ్లింగ్​ని గుర్తించడం నేర్చుకోండి.

న్యూమరికల్స్: భౌతిక శాస్త్రంలోని లెక్కలు, థియరమ్స్ నిరూపణలపై దృష్టి పెట్టండి.

2. గణితం

పునాది ముఖ్యం: ముందుగా గణితంలోని ప్రాథమిక సూత్రాలు, కాన్సెప్టులపై పట్టు సాధించండి.

నిరంతర సాధన: లెక్కలను మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రశ్నలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

వనరులు: ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలతో పాటు ఆర్‌డీ శర్మ, క్వశ్చన్ బ్యాంకులు, ఎగ్జాంప్లర్ పుస్తకాలను సాధన చేయండి.

టైమ్ మేనేజ్‌మెంట్: పేపర్ సాల్వ్ చేసేటప్పుడు టైమర్ పెట్టుకోండి. దీనివల్ల మీ వేగం, కచ్చితత్వం పెరుగుతాయి.

3. ఇంగ్లీష్

రీడింగ్: వొకాబ్యులరీ, రీడింగ్​ శక్తిని పెంచుకోవడానికి నిరంతరం చదవడం అలవాటు చేసుకోండి.

రైటింగ్ స్కిల్స్: వ్యాసాలు, ఉత్తరాలు, రిపోర్ట్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి.

నోట్స్: ముఖ్యమైన థీమ్స్, క్యారక్టర్స్​, కథాంశాలపై నోట్స్ రాసుకోండి. గ్రామర్ నియమాలను రోజూ ప్రాక్టీస్ చేయండి.

4. సోషల్ సైన్స్

మైండ్ మ్యాప్స్: సులభంగా గుర్తుంచుకోవడానికి టైమ్-లైన్లు, మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోండి.

సమాధానాల నిర్మాణం: జవాబులను బుల్లెట్ పాయింట్లు, సబ్-హెడ్డింగులతో నీట్‌గా రాయడం అలవాటు చేసుకోండి.

5. హిందీ/సంస్కృతం

భాషా నైపుణ్యాల కోసం పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవండి. వ్యాసాలు, లేఖలు, కాంప్రహెన్షన్ ప్యాసేజ్‌లను ప్రాక్టీస్ చేయండి. క్విక్ రివిజన్ కోసం చిన్న నోట్స్ సిద్ధం చేసుకోండి.

సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు- ఈ స్టడీ టిప్స్​తో టాపర్​ అవ్వండి..

సిలబస్‌పై పట్టు: ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో తెలుసుకుని, దానికి అనుగుణంగా చదవండి.

స్టడీ ప్లాన్: ఫైనల్​ ప్రిపరేషన్​కి తగ్గట్టు ఒక టైమ్ టేబుల్ రూపొందించుకోండి. కష్టమైన సిలబస్‌ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవండి. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోండి.

ఎన్​సీఈఆర్​టీ ప్రాధాన్యత: మొదట ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవండి. ఆ తర్వాతే ఇతర అదనపు వనరులను (ఆన్​లైన్​/ఆఫ్​లైన్​) వాడండి.

రెగ్యులర్ రివిజన్: ముఖ్యాంశాలను సొంత మాటల్లో రాసుకోండి. అప్పుడు మీకు బాగా గుర్తుంటాయి. కాన్సెప్ట్​లను గుర్తుంచుకోవడానికి ఫ్లాష్ కార్డ్‌లు వాడండి.

మాక్ టెస్టులు: పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం కోసం సమయాన్ని కేటాయించండి. దీని ద్వారా వాస్తవ సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్ష వాతావరణంపై అవగాహన వస్తుంది. బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి మెరుగుపరుచుకోండి.

చివరిగా.. పదో తరగతిలో టాప్ మార్కులు సాధించడం అనేది మీ నిరంతర కృషి, ఏకాగ్రత, సరైన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. సరైన నిద్రతో, మంచి ఆరోగ్య అలవాట్లతో పాటు పైన చెప్పిన టిప్స్​ని పాటిస్తే మీరు కచ్చితంగా సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks