CSK vs DC: హ్యాట్రిక్ ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు ఫస్ట్ విక్టరీ. అయిదు సార్లు ఛాంపియన్ అయిన ఆ టీమ్ ఐపీఎల్ 2026లో బోణీ కొట్టింది. శనివారం (ఏప్రిల్ 11) రాత్రి చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 23 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది.
శాంసన్ సెంచరీ

ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు వచ్చిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో తన సత్తాచాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఆటాడుకున్నాడు. శాంసన్ 56 బంతుల్లోనే 115 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. ఈ ఐపీఎల్ 2016లో ఇదే ఫస్ట్ సెంచరీ.
బిగ్ స్కోరు
సంజు శాంసన్ (115 నాటౌట్)తో పాటు ఆయుష్ మాత్రె (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), శివమ్ దూబె (10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 20 నాటౌట్) చెలరేగడంతో చెన్నై బిగ్ స్కోరు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు సాధించింది.
ఢిల్లీ చెత్త రికార్డు
ఢిల్లీ క్యాపిటల్స్ తన చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. సీఎస్కేతో మ్యాచ్ లో ఛేజింగ్ లో ఆ టీమ్ 189 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఆలౌటైన టీమ్ గా ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ లో కొనసాగుతోంది. ఆ జట్టు 31 సార్లు ఆలౌటైంది. సెకండ్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్ (27) ఉంది.
ఆయుష్ మాత్రె రిటైర్డ్ ఔట్
సీఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్ ఆయుష్ మాత్రె రిటైర్డ్ ఔట్ వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎస్కే టీమ్ పై విమర్శలు వస్తున్నాయి. ఆయుష్ మాత్రె అప్పటికే బాగా ఆడుతున్నాడు. 36 బాల్స్ లోనే 59 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. 163.88 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ 18వ ఓవర్ మూడో బాల్ కు ఆయుష్ ను బయటకు వచ్చేయమని డగౌట్ నుంచి సందేశాలు వెళ్లాయి.
{{/usCountry}}సీఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్ ఆయుష్ మాత్రె రిటైర్డ్ ఔట్ వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎస్కే టీమ్ పై విమర్శలు వస్తున్నాయి. ఆయుష్ మాత్రె అప్పటికే బాగా ఆడుతున్నాడు. 36 బాల్స్ లోనే 59 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. 163.88 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ 18వ ఓవర్ మూడో బాల్ కు ఆయుష్ ను బయటకు వచ్చేయమని డగౌట్ నుంచి సందేశాలు వెళ్లాయి.
{{/usCountry}}ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి, మంచి ఫామ్ లో ఉన్న యువ బ్యాటర్ ఆయుష్ పట్ల సీఎస్కే ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె 10 బాల్స్ మాత్రమే ఆడి 20 రన్స్ చేశాడు.
సర్ఫరాజ్ క్యాచ్
కాస్త బొద్దుగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ లో చురుగ్గా ఉండడనే అభిప్రాయాలున్నాయి. కానీ అవన్నీ తప్పని నిరూపిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సర్ఫరాజ్ సూపర్ మ్యాన్ లా అందుకున్న క్యాచ్ హైలైట్ గా నిలిచింది. ఢిల్లీ ఛేజింగ్ లో గుర్జప్ నీత్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ బంతిని కట్ చేశాడు. అది బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న సర్ఫరాజ్ ఒక్కసారిగా సూపర్ మ్యాన్ లా తన రైడ్ సైడ్ గాల్లోకి ఎగిరి క్యాచ్ కంప్లీట్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.