...
...
Next Story

Fifa World Cup OTT: నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్ 2026- 4 భాషల్లో లైవ్ స్ట్రీమింగ్- 2034 వరకు డీల్- ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Fifa World Cup 2026 OTT Streaming Live Details: ఫిఫా వరల్డ్ కప్ 2026 నేటి (జూన్ 11) నుంచే ప్రారంభం కానుంది. అందుకోసం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్నీ విశ్లేషణల కోసం భారత ఫుట్‌బాల్ లెజెండ్ బైచుంగ్ భూటియాను ఎక్స్‌పర్ట్ ప్యానలిస్ట్‌గా ఉన్నారు.

Published on: Jun 11, 2026, 09:09:41 IST
Advertisement

Fifa World Cup 2026 OTT Streaming Live Details: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఫిఫా ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ జాతర నేటి (జూన్ 11) నుంచే ఘనంగా ప్రారంభం కానుంది. భారత్‌లోని ఫుట్‌బాల్ ప్రేమికులకు ఈ మెగా టోర్నీని మరింత దగ్గర చేసేందుకు ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) సర్వం సిద్ధం చేసింది.

పక్కా ప్లానింగ్‌తో జీ5 ఓటీటీ

నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్ 2026- 4 భాషల్లో లైవ్ స్ట్రీమింగ్- 2034 వరకు డీల్- ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్ 2026- 4 భాషల్లో లైవ్ స్ట్రీమింగ్- 2034 వరకు డీల్- ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను అత్యుత్తమ క్వాలిటీతో కూడిన లైవ్ ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా వీక్షకులకు అందించేందుకు జీ5 పక్కా ప్రణాళికలు రచించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫుట్‌బాల్‌కు భారీగా ఆదరణ పెరుగుతోంది. అర్ధరాత్రి మ్యాచ్‌లు ఉన్నా సరే మొబైల్ స్క్రీన్‌లకు అతుక్కుపోయే అభిమానుల కోసం ఈసారి సరికొత్త డిజిటల్ అనుభూతిని మేకర్స్ సిద్ధం చేశారు.

జీ5 ప్యానల్‌లోకి భారత ఫుట్‌బాల్ లెజెండ్

ఈసారి వరల్డ్ కప్‌ టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియాను జీ5 ఓటీటీ తన ఎక్స్‌పర్ట్ ప్యానల్‌లోకి తీసుకువచ్చింది. భారత ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా, మాజీ కెప్టెన్‌గా భూటియాకు క్రీడా ప్రపంచంలో తిరుగులేని గుర్తింపు ఉంది. తన సుదీర్ఘ మైదాన అనుభవంతో మ్యాచ్‌లకు సంబంధించిన లోతైన విశ్లేషణలు, వ్యూహాలను ఆయన వీక్షకులకు వివరించనున్నారు.

"ఫుట్‌బాల్ అభిమానులను ఏకం చేస్తుంది" - భూటియా

ఈ ప్రతిష్టాత్మక ప్యానల్‌లో భాగం కావడంపై బైచుంగ్ భూటియా తన సంతోషాన్ని పంచుకున్నారు. "భారతదేశంలోని ఫుట్‌బాల్ అభిమానులకు ఫిఫా ప్రపంచకప్ ఎప్పుడూ ఒక గొప్ప స్ఫూర్తిగా, మరపురాని జ్ఞాపకంగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకే తాటిపైకి తెచ్చే ఒక అద్భుతమైన వేదిక" అని బైచుంగ్ భూటియా అన్నారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఫిఫా (FIFA) తో సుదీర్ఘ కాలం పాటు కొనసాగే చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం 2026 నుంచి 2034 వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే జీ5 ఓటీటీ, యునైట్8 (Unite8) ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే కాలంలో జరిగే అత్యంత క్రేజీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను భారత వీక్షకులు ఎంజాయ్ చేయవచ్చు.

4 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్

ఈ టోర్నీ మ్యాచ్‌లు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళ 4 భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. ఈ భారీ డీల్‌లో కేవలం 2026 పురుషుల ప్రపంచకప్ మాత్రమే కాకుండా, 2027లో జరగబోయే ఫిఫా మహిళల ప్రపంచకప్, అలాగే 2030 ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు ఇతర ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్‌ల ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు కూడా ఉన్నాయి. దీనివల్ల భారతీయ క్రీడా రంగంలో డిజిటల్ వీక్షణ సరికొత్త పుంతలు తొక్కనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe