హ్యుందాయ్ మోటార్స్ తన పాపులర్ సెడాన్ 'వెర్నా' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై వేగంగా పనిచేస్తోంది. కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే, ఈ కారు రోడ్డు మీద టెస్టింగ్ చేస్తున్న సమయంలో కెమెరాకు చిక్కింది. ముఖ్యంగా ఈ సెడాన్ ఇంటీరియర్స్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో, పాత మోడల్ కంటే ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో స్పష్టత వచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- సెడాన్ ఇంటీరియర్‌లో కీలక మార్పులు..

లీకైన ఫోటోల ప్రకారం, హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ లోపల సంస్థ గణనీయమైన మార్పులు చేసింది:
కొత్త స్టీరింగ్ వీల్: పాత స్టీరింగ్ స్థానంలో హ్యుందాయ్ కొత్త మోడల్స్ (అయానిక్ 5 వంటివి)లో కనిపించే స్టీరింగ్ వీల్‌ను ఇందులో అందించారు. దీని మధ్యలో హ్యుందాయ్ 'హెచ్' లోగోకు బదులుగా నాలుగు చుక్కలు ఉండటం విశేషం.
స్పోర్టీ లుక్: టెస్టింగ్ చేస్తున్న కారును గమనిస్తే, ఇది స్పోర్టీ వెర్షన్ అని తెలుస్తోంది. స్టీరింగ్ వీల్, సీట్ కవర్లపై ఎరుపు రంగు స్టిచింగ్‌తో కూడిన డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను ఇందులో చూడవచ్చు.
డిస్‌ప్లే: ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగానే ఇందులో కూడా రెండు 10.25-ఇంచ్ స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తాయి.
MG Majestor Vs Toyota Fortuner : ఈ రెండు బడా ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఎక్స్‌టీరియర్ డిజైన్..
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బయటి భాగంలో స్టైలిష్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ముందు భాగంలో ఉండే హారిజాంటల్ ఎల్ఈడీ స్ట్రిప్ అలాగే కొనసాగుతాయి. అయితే కింద చెప్పిన వాటిల్లో మార్పులు కనిపిస్తాయి.
{{/usCountry}}హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బయటి భాగంలో స్టైలిష్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ముందు భాగంలో ఉండే హారిజాంటల్ ఎల్ఈడీ స్ట్రిప్ అలాగే కొనసాగుతాయి. అయితే కింద చెప్పిన వాటిల్లో మార్పులు కనిపిస్తాయి.
{{/usCountry}}ఫ్రంట్ గ్రిల్ అండ్ బంపర్: కారు ముందు వైపు ఉన్న గ్రిల్ డిజైన్‌లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. బంపర్ కింది భాగంలో, వెనుక బంపర్ వద్ద సిల్వర్ యాక్సెంట్స్ కనిపించే అవకాశం ఉంది.
అలాయ్ వీల్స్: కారుకు మరింత ఆధునిక రూపాన్ని ఇచ్చేందుకు అలాయ్ వీల్స్ డిజైన్‌ను కూడా అప్‌డేట్ చేయనున్నారు.
ఎస్‌యూవీల వైపే మొగ్గు, పడిపోయిన చిన్న కార్ల విక్రయాలు: సియామ్ తాజా గణాంకాలు ఇవీ
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్- ఇంజన్, పెర్ఫార్మెన్స్..
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. గతంలో ఉన్న రెండు పెట్రోల్ ఆప్షన్లతోనే ఈ సెడాన్ లభించవచ్చు. అవి..
1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: ఇది 115 హెచ్‌పీ పవర్‌ని, 143 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, ఐవీటీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
1.5-లీటర్ టర్బో పెట్రోల్: ఇది 160 హెచ్‌పీ పవర్‌ని, 257 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది మాన్యువల్, డీసీటీ (డ్యూయల్ క్లచ్) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్‌పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాంచ్ నా టికి ఈ కొత్త వెర్నా సెడాన్‌కి సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు తెలుస్తాయి.
మరో వార్తలో ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన తన పోర్ట్‌ఫోలియోలోని పలు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌పై హ్యుందాయ్ ఇండియా సంస్థ భారీ ఆఫర్లను ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 73వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు కొత్త కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఆఫర్లు ఈ ఫిబ్రవరి 28 వరకే అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆఫర్ల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రశ్నలు- సమాధానాలు-
ప్రశ్న- కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?
ప్రస్తుత సమాచారం ప్రకారం, 2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మార్చి 2026 నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఇండియా ఇప్పటికే ఈ కారును రోడ్లపై టెస్టింగ్ చేస్తుండటంతో, ఇది మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని సూచిస్తోంది.