2026 Hyundai Verna : హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​- బేస్​ వేరియంట్​లోనే అదిరే ఫీచర్లు, ఫుల్​ సేఫ్టీ!

Hyundai Verna facelift : హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ వచ్చేసింది. మరి మీరు ఈ సెడాన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ 2026 హ్యుందాయ్​ వెర్నాలోని బేస్​ వేరియంట్​ ఫీచర్స్​, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి.

Published on: Mar 10, 2026, 12:21:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​లలో ఒకటిగా కొనసాగుతోంది హ్యుందాయ్​ వెర్నా. మార్కెట్​ పోటీని తట్టుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఈ వెర్నాని సంస్థ అప్​డేట్​ చేసింది. ఇందులో భాగంగానే 2026 హ్యుందాయ్​ వెర్నా తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ ఫేస్​లిఫ్ట్​ వెర్షన్‌లో ఈ మోడల్​ని మరింత షార్ప్‌గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది సంస్థ. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అదనపు ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలను జోడించింది. మరి మీరు ఈ కారును కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​ “హెచ్​ఎక్స్​2”కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ బేస్​ వేరియంట్..
హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ బేస్​ వేరియంట్..

2026 హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​- ఇంజిన్, గేర్‌బాక్స్..

2026 హ్యుందాయ్​ వెర్నా హెచ్​ఎక్స్​2 వేరియంట్​ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

ఇంజిన్: 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.

గేర్‌బాక్స్: ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2026 హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​- భద్రతా ఫీచర్లు..

బేస్ వేరియంట్ అయినప్పటికీ, హ్యుందాయ్ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో స్టాండర్డ్ ఫీచర్లుగా కిందివి ఉన్నాయి:

6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రయాణికులందరికీ గరిష్ట రక్షణ)

హిల్‌ స్టార్ట్ అసిస్ట్ (కొండ ప్రాంతాల్లో కారు వెనక్కి వెళ్లకుండా చూస్తుంది)

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (వీఎస్​ఎం)

ఏబీఎస్​ విత్ ఈబీడీ (బ్రేకింగ్ నియంత్రణ కోసం)

ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, రియర్ డీఫాగర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు.

2026 హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​- ఎక్స్‌టీరియర్ లుక్..

హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​ హెచ్​ఎక్స్​2 వేరియంట్ బయటి నుంచి చూడటానికి కూడా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది:

హెడ్‌ల్యాంప్స్: ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్.

గ్రిల్: బ్లాక్ కలర్ రేడియేటర్ గ్రిల్.

వీల్స్: 15- ఇంచ్​ స్టీల్ వీల్స్ (వీల్ కవర్లతో కలిపి).

అదనంగా: బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్.

2026 హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​- ఇంటీరియర్, సౌకర్యాలు..

లోపలి భాగం డ్యూయల్-టోన్ థీమ్‌తో రిచ్‌గా కనిపిస్తుంది.

సీట్లు: క్లాత్ అప్‌హోలిస్ట్రీ, డ్రైవర్ సీటుకు మాన్యువల్ హైట్ అడ్జస్ట్ సదుపాయం.

స్టీరింగ్: సరికొత్త డిజైన్‌తో కూడిన 'డీ-కట్​' స్టీరింగ్ వీల్.

సౌకర్యం: కప్పు హోల్డర్లతో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, హైట్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు.

ఈ హ్యుందాయ్​ వెర్నా ఫేస్​లిఫ్ట్​లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఇలా :

అన్ని పవర్ విండోస్.

ఏసీ.

టిల్ట్ స్టీరింగ్ (అడ్జస్ట్ చేసుకునే సదుపాయం).

మొబైల్ ఛార్జింగ్ కోసం టైప్-సీ యూఎస్బీ పోర్ట్‌లు, 12వీ పవర్ అవుట్‌లెట్.

ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ఓఆర్​వీఎంలు).

2026 హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​- ధర..

ఈ హ్యుందాయ్​ వెర్నా బేస్​ వేరియంట్​ “హెచ్​ఎక్స్​” ఎక్స్​షోరూం ధర రూ. 10.98 లక్షలుగా ఉంది.

2026 హ్యుందాయ్​ వెర్నాలోని ఇతర​ వేరియంట్లు, వాటి ఫీచర్లు, వాటి ధరల వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. వెర్నా హెచ్​ఎక్స్​2 వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉందా?

లేదు. 2026 వెర్నా హెచ్​ఎక్స్​2 బేస్ వేరియంట్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఆటోమేటిక్ (సీవీటీ లేదా డీసీటీ) కావాలనుకునే వారు పై వేరియంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

2. బేస్ వేరియంట్లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయా?

అవును. హ్యుందాయ్ వెర్నా 2026 మోడల్‌లో భద్రతకు పెద్దపీట వేస్తూ, బేస్ వేరియంట్ హెచ్​ఎక్స్​ 2 నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More