ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన నూతన నిబంధనల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ల సంపాదన గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ప్రముఖ బీమా బ్రోకర్ అంచనా ప్రకారం కమీషన్ వ్యత్యాసాలు ఇలా ఉండనున్నాయి.

మోటార్ ఇన్సూరెన్స్: ప్రస్తుతం రూ. 100 నూతన ప్రీమియంపై డిస్ట్రిబ్యూటర్ రూ. 36 నుంచి రూ. 38 వరకు కమీషన్ పొందుతుండగా, ప్రతిపాదిత కొత్త విధానంలో ఇది రూ. 5 నుంచి రూ. 7కి పడిపోయే అవకాశముంది.
హెల్త్ ఇన్సూరెన్స్: రూ. 100 నూతన ప్రీమియంపై ప్రస్తుతం వస్తున్న రూ. 30 నుంచి రూ. 33 కమీషన్, ప్రతిపాదనల అమలు తర్వాత దాదాపు రూ. 15కి తగ్గొచ్చు.
ఈ ప్రభావం చిన్న పట్టణాల్లోని స్థానిక ఏజెంట్లపై తీవ్రంగా పడనుంది. టైర్-3 పట్టణంలో బైక్, కార్, ఫ్యామిలీ హెల్త్ పాలసీలు విక్రయిస్తూ నెలకు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు సంపాదించే ఒక ఏజెంట్ ఆదాయం, ఈ కొత్త నిబంధనలతో రూ. 3,000 నుంచి రూ. 6,000కి పడిపోవచ్చని నిపుణులు లెక్కిస్తున్నారు. కమీషన్లు తగ్గినా ప్రయాణం, ఫోన్ ఛార్జీలు, లైసెన్సింగ్ ఖర్చులు తగ్గకపోవడం ఏజెంట్లకు సవాలుగా మారనుంది.
శ్రమ ఒకటే.. ఆదాయం మాత్రం వేరు!
"రూ. 3,000 విలువైన ద్విచక్ర వాహన పాలసీ అమ్మాలన్నా, రూ. 30,000 విలువైన ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అమ్మాలన్నా ఏజెంట్ పెట్టాల్సిన శ్రమ, సమయం దాదాపు ఒక్కటే. చిన్న పట్టణాల్లో కస్టమర్‌కు సేవలు అందించడానికి అయ్యే కనీస వ్యయం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది" అని ఒక బీమా బ్రోకర్ వ్యాఖ్యానించారు.
కమీషన్ శాతం తగ్గడం వల్ల తక్కువ ప్రీమియం ఉండే పాలసీలను విక్రయించడం ఏజెంట్లకు ఆర్థికంగా గిట్టుబాటు కాదు. ఫలితంగా ఏజెంట్లు చిన్న మొత్తాల పాలసీలు లేదా మొదటిసారి బీమా తీసుకునేవారికి సేవలు అందించడానికి ఆసక్తి చూపకపోవచ్చు.
చిన్న పట్టణాల్లో పెరుగుతున్న ఇన్సూరెన్స్ ప్రాధాన్యం
మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాల్లో పాలసీ ప్రీమియంలు తక్కువగానే ఉన్నప్పటికీ, ఇక్కడి కస్టమర్లు క్రమంగా ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీల వైపు మొగ్గు చూపుతున్నారు. డేటా ప్రకారం.. 2020 నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లో ఒక్కో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సగటు ప్రీమియం విలువ 70 శాతానికి పైగా పెరిగింది. ప్రజలు ఉన్నతమైన బీమా కవరేజ్ వైపు మళ్లుతున్న ఈ సమయంలో, స్థానిక ఏజెంట్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఎంతో అవసరం.
{{/usCountry}}మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాల్లో పాలసీ ప్రీమియంలు తక్కువగానే ఉన్నప్పటికీ, ఇక్కడి కస్టమర్లు క్రమంగా ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీల వైపు మొగ్గు చూపుతున్నారు. డేటా ప్రకారం.. 2020 నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లో ఒక్కో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సగటు ప్రీమియం విలువ 70 శాతానికి పైగా పెరిగింది. ప్రజలు ఉన్నతమైన బీమా కవరేజ్ వైపు మళ్లుతున్న ఈ సమయంలో, స్థానిక ఏజెంట్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఎంతో అవసరం.
{{/usCountry}}"డిజిటల్ వేదికలు ఎంత పెరిగినా, చిన్న పట్టణాల్లో మొదటిసారి పాలసీ తీసుకునేవారికి స్థానిక ఏజెంట్ సలహా అత్యంత కీలకం" అని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
డిజిటల్ సేవలు స్థానిక ఏజెంట్లను భర్తీ చేయగలవా?
తక్కువ వ్యయంతో కార్యకలాపాలు సాగించేందుకు కంపెనీలు డిజిటల్ లేదా సెల్ఫ్-సర్వీస్ మార్గాలపై దృష్టి పెట్టవచ్చు. కానీ, చిన్న పట్టణాల్లోని ప్రజలకు డిజిటల్ మాధ్యమాలు కేవలం సహాయకారిగా (Assisted Digital) మాత్రమే ఉపయోగపడతాయి.
వెయిటింగ్ పీరియడ్‌లు, మినహాయింపులు (Exclusions), క్లెయిమ్ ప్రక్రియల గురించి వివరించడానికి మానవ ప్రమేయం లేదా ఏజెంట్ అవసరం తప్పనిసరి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు స్వయంగా ఆన్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేసినప్పటికీ, గ్రామీణ, చిన్న పట్టణాల కస్టమర్లు ఇప్పటికీ స్థానిక ఏజెంట్లపైనే ఆధారపడుతున్నారు.
పరిష్కార మార్గాలు ఏమిటి?
ఈ సవాళ్లను అధిగమించడానికి బీమా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు:
1. ప్రత్యేక అలవెన్స్: బీమా విస్తరణ తక్కువగా ఉన్న ప్రాంతాల (Underserved Areas) కోసం ఇచ్చే ప్రత్యేక అలవెన్స్‌ను కేవలం కమీషన్ సీలింగ్‌కు శాతంగా కాకుండా, అక్కడి కస్టమర్లను పొందేందుకు అయ్యే అసలు ఖర్చు ఆధారంగా నిర్ణయించాలి.
2. దీర్ఘకాలిక కమీషన్ల చెల్లింపు: కమీషన్‌ను ఒకేసారి తగ్గించకుండా, పాలసీ కొనసాగే కాలాన్ని బట్టి చెల్లించాలి. పాలసీ మధ్యలోనే రద్దయితే (Lapse) కమీషన్‌ను వెనక్కి తీసుకునే నిబంధనలు పెట్టాలి.
3. క్లెయిమ్ సేవలకు గుర్తింపు: అమ్మకంతో పాటు క్లెయిమ్ సహాయం వంటి విక్రయానంతర సేవలకు కూడా తగిన విలువ ఇవ్వాలి.
సాంకేతికతను ఉపయోగిస్తూనే, స్థానిక ఏజెంట్ల ఉపాధి దెబ్బతినకుండా చూస్తేనే చిన్న పట్టణాల్లో బీమా విస్తరణ నిరంతరాయంగా ముందుకు సాగుతుంది.