Mercedes Benz CLA Electric : మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎలక్ట్రిక్ కారు- 790 కి.మీ రేంజ్, లగ్జరీ ఫీచర్లతో..
మెర్సిడెస్-బెంజ్, తన ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ సెడాన్ సీఎల్ఏ ఎలక్ట్రిక్‌ను ఏప్రిల్ 24, 2026న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దాదాపు 792 కి.మీ అత్యుత్తమ రేంజ్, ఏఐ ఫీచర్లు, మెర్సిడెస్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ కారు లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది.
మెర్సిడెస్-బెంజ్ తన పోర్ట్‌ఫోలియోను క్రమబద్ధీకరిస్తూ, పాత ఏ-క్లాస్ లిమౌసిన్, ఈక్యూఏ, ఈక్యూబీ మోడళ్ల స్థానంలో సరికొత్త 'సీఎల్ఏ ఎలక్ట్రిక్'ను తీసుకువస్తోంది. 2020లో ఐసీఈ వెర్షన్ నిలిపివేసిన తర్వాత, మళ్లీ ఈ పేరుతో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ అవతార్‌లో ఈ కారు భారత్‌కు వస్తోంది. దీని అంచనా ధర రూ. 59.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- బ్యాటరీ, పవర్, ఛార్జింగ్..
ఈ స్మార్ట్ సెడాన్ పనితీరు పరంగా దిగ్గజ, లగ్జరీ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది:
వేరియంట్: భారత్‌లో ఇది '250+' అనే వేరియంట్‌లో లభించే అవకాశం ఉంది.
బ్యాటరీ: 85.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
పర్ఫార్మెన్స్: వెనుక యాక్సిల్‌పై అమర్చిన మోటార్ 270 హెచ్‌పీ పవర్‌ని, 335 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 792 కి.మీప్రయాణించవచ్చు. ఎంట్రీ-లెవల్ లగ్జరీ ఈవీల్లో ఇదే అత్యధిక రేంజ్.
అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్: ఇందులో 800వీ ఆర్కిటెక్చర్ ఉంది. 240 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో 400 కి.మీ ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్‌ను పొందవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్- ఎక్స్‌టీరియర్..
ఆధునిక డిజైన్- సీఎల్ఏ ఎలక్ట్రిక్ కొత్త మెర్సిడెస్-బెంజ్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్‌పై రూపొందుతోంది
సిల్హౌట్: ఇది కూపే తరహా డిజైన్‌ను కలిగి ఉంది.
ముందు భాగం: మూసి ఉన్న ఫ్రంట్ గ్రిల్‌పై 142 వెలుగుతున్న మూడు కోణాల నక్షత్రాలు ఉంటాయి. హెడ్‌లైట్లు కూడా అదే స్టార్ మోటిఫ్ థీమ్‌తో వస్తాయి.
వెనుక భాగం: ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో మరింత ప్రీమియం లుక్‌ను పొందుతుంది.
ఏఎంజీ లైన్: 250+ వేరియంట్‌లో స్పోర్టియర్ బంపర్స్, 18- ఇంచ్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం పెడల్స్ స్టాండర్డ్‌గా వస్తాయి.
Kia Seltos : ఈ ఎస్‌యూవీతో మీ ప్రయాణం మరింత సేఫ్! 2026 కియా సెల్టోస్‌కి 5 స్టార్ రేటింగ్..
ఇంటీరియర్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం!
కారు లోపలి భాగం ఒక టెక్నాలజీ హబ్‌లా ఉంటుంది:
డిస్‌ప్లే: 10.25- ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 14- ఇంచ్ భారీ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
ఏఐ ఇంటిగ్రేషన్: ఇందులో MBUX వర్చువల్ అసిస్టెంట్ ఉంది. ఇది చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ సపోర్ట్‌తో పనిచేస్తుంది, దీనివల్ల డ్రైవర్ కారుతో సహజంగా సంభాషించవచ్చు.
MB.OS: మెర్సిడెస్ సొంతంగా అభివృద్ధి చేసిన 'మెర్సిడెస్-బెంజ్ ఆపరేటింగ్ సిస్టమ్' ఇందులో అరంగేట్రం చేస్తోంది. ఇది చిప్-టు-క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా పనిచేస్తుంది.
Hyundai Venue : అదరగొట్టిన హ్యుందాయ్ వెన్యూ- క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్..!
సౌకర్యాలు: వైర్‌లెస్ ఛార్జింగ్, ఆరు 100డబ్ల్యూ యూఎస్బీ-సీ పోర్ట్‌లు, మసాజింగ్ సీట్లు వంటి విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఈ మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ కారు ఏప్రిల్ 24న లాంచ్ అవుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


