3 కొత్త ఎస్‌యూవీలు.. బేస్ వేరియంట్‌లోనే అదిరే ఫీచర్లు- ఏది బెస్ట్?
టాటా సియెర్రా, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, 2026 కియా సెల్టోస్‌ల రూపంలో మార్కెట్లో ఎస్‌యూవీల ఆప్షన్స్ మరింత పెరిగాయి. మరీ ముఖ్యంగా ఈ మూడు ఎస్‌యూవీల బేస్ వేరియంట్లు అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్నాయి. మరి వీటిల్లో ఏది వాల్యూ ఫర్ మనీ? ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా కంపెనీలు తమ బేస్ వేరియంట్లలోనే ఇప్పుడు విలాసవంతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన టాటా సియెర్రా, 2026 కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బేస్ వేరియంట్లు ఇందుకు నిదర్శనం. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ మూడింటిలో ఏది వాల్యూ ఫర్ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా బేస్ వేరియంట్..
టాటా సియెర్రా ఎస్యూవీ గత నవంబర్‌లో లాంచ్ అయ్యింది. దీని బేస్ వేరియంట్ పేరు స్మార్ట్+. ఈ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభం. ఈ వేరియంట్ ఫీచర్లు..
ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్
ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్
లైట్ సేబర్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, టెయిల్ ల్యాంప్
సెంట్రల్ లాకింగ్
రేర్ విండో సన్‌షేడ్
అన్ని పవర్ విండోస్
బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు
ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్
10.16 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్
ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు
ప్రకాశవంతమైన లోగోతో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్
రేర్ ఏసీ వెంట్స్
టైప్ ఏ + టైప్ సీ 45డబ్ల్యూ యూఎస్‌బీ పోర్టులు
వెల్‌కమ్ లైట్స్‌తో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్
టాటా సియెర్రా బేస్ వేరియంట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బేస్ వేరియంట్..
మహీంద్రా తన ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ అయిన ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓని ఇటీవలే లాంచ్ చేసింది. ఇందులో 'ఏఎక్స్' బేస్ వేరియంట్‌గా ఉంది. 2.0లీటర్ టర్బో పెట్రోల్, 2.2లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
ధర: పెట్రోల్ వేరియంట్ రూ. 13.66 లక్షలు, డీజిల్ రూ. 14.96 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఫీచర్లు ఇలా..
క్లియర్ లెన్స్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్
పియానో బ్లాక్ క్లాడింగ్
ఫుల్ సైజ్డ్ వీల్ కవర్‌తో కూడిన ఆర్17 స్టీల్ వీల్స్
కోస్ట్ టు కోస్ట్ ట్రిపుల్ 12.5 ఇంచ్ హెచ్డీ స్క్రీన్స్
6-స్పీకర్ ఆడియో సిస్టెమ్
ఇంటెలిజెంట్ అడ్రినోక్స్
స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ
అలెక్సా బిల్ట్-ఇన్ విత్ చాట్‌జీపీటీ
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే
ఫ్రాంట్ టైప్ సీ 65డబ్ల్యూ, 15డబ్ల్యూ టైప్ ఏ-యూఎస్‌బీ
రేర్ టైప్ సీ 65డబ్ల్యూ యూఎస్‌బీ
థర్డ్ రో 12వీ ఛార్జింగ్ పోర్ట్
క్రూయిజ్ కంట్రోల్
బై-ఎల్‌ఈడీ ప్రొడెక్టర్ హెడ్‌ల్యాంప్స్ విత్ డీఆర్ఎల్
థర్డ్ రో ఏసీ వెంట్స్
డ్రైవ్ మోడ్- జిప్, జ్యాప్, జ్యూమ్ (డీజిల్ వేరియంట్లో మరిన్ని కస్టమ్ ఆప్షన్స్)
ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎం
షార్క్ పిన్ యాంటీనా
స్మార్ట్ డోర్ హ్యాండిల్స్
ఫ్రెంట్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజ్
డే అండ్ నైట్ ఐఆర్వీఎం
మైక్రో హైబ్రీడ్ టెక్నాలజీ
రేర్ ఏసీ వెంట్స్ (2-3 రోలకు)
రూఫ్ రెయిల్స్ అండ్ రేర్ స్పాయిలర్స్
ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
పుష్ బటన్ స్టార్ట్
కో-డ్రైవర్ సన్‌విజర్ విత్ మిర్ర్
రేర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ విత్ కప్ హోల్డర్
6-వే మేన్యువల్ డ్రైవర్ సీట్ అడ్జెస్ట్మెంట్
హైట్-అడ్జెస్టెబుల్ డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్ బెల్ట్స్
4 పవర్ విండోలు
వన్-టచ్ డౌన్ డ్రైవర్ డోర్ పవర్ విండో
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బేస్ వేరియంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2026 కియా సెల్టోస్ బేస్ వేరియంట్..
2026 కియా సెల్టోస్ కూడా ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టింది. తక్కువ ధరలో స్టైలిష్ కారు కోరుకునే వారికి సెల్టోస్ మొదటి ఛాయిస్‌గా నిలుస్తోంది. దీని బేస్ వేరియంట్ పేరు హెచ్‌టీఈ.
ధర: పెట్రోల్ మాన్యువల్ రూ. 10.99 లక్షలు, డీజిల్ మాన్యువల్ రూ. 12.59 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఫీచర్లు ఇలా..
12 ఇంచ్ ఎల్సీడీ క్లస్టర్ విత్ 4.2 ఇంచ్ కలర్ టీఎఫ్టీ ఎంఐడ
10.25 ఇంచ్ ఇన్ఫోటైమ్నెంట్ సిస్టెమ్
వైర్‌లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో
క్రూయిజ్ కంట్రోల్
మేన్యువల్ ఏసీ విత్ రేర్ ఏసీ వెంట్స్
ఎలక్ట్రిక్ ఓఆర్‌వీఎంలు
డీ-కట్ స్టీరింగ్ వీల్ విత్ మీడియా కంట్రోల్స్
మేన్యువల్ సీట్ హైట్ అడ్జెస్ట్మెంట్
స్పీకర్లు
ఏది ఎంచుకుంటే బెటర్?
వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ముందంజలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండింటిలోనూ బేస్ వేరియంట్‌లోనే టచ్‌స్క్రీన్, స్పీకర్లు, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి నిత్యావసర ఫీచర్లు లభిస్తాయి.
మరోవైపు, టాటా సియెర్రా భద్రత, యాంత్రిక పరంగా (ఆల్ డిస్క్ బ్రేక్స్, టెయిల్‌గేట్ రిలీజ్) అద్భుతంగా ఉన్నప్పటికీ, ఎంటర్టైన్మెంట్ ఫీచర్ల కోసం మీరు పై వేరియంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాధాన్యత లగ్జరీ, టెక్నాలజీ అయితే మహీంద్రా వైపు, బడ్జెట్- స్టైల్ అయితే కియా వైపు చూడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


