...
...
Next Story

Weight loss tips : బరువు తగ్గిన తర్వాత మళ్లీ పెరగకూడదా? అయితే రోజుకు 8,500 అడుగులు వేయాల్సిందే!

8500 steps for weight loss : ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10,000 అడుగులు నడవాలని మనం వింటూ ఉంటాం. కానీ, ఆధునిక జీవనశైలిలో అంత సమయం కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, బరువు తగ్గిన వారు ఆ బరువును అలాగే నిలబెట్టుకోవడానికి రోజుకు 8500 అడుగులు వేస్తే సరిపోతుందని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది.

Updated on: May 13, 2026, 10:08:58 IST
Advertisement

Walking for weight loss : బరువు తగ్గడం ఒక ఎత్తు అయితే, తగ్గిన బరువును మళ్లీ పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తు1 డైటింగ్ చేసి బరువు తగ్గిన వారిలో దాదాపు 80 శాతం మంది మూడు నుంచి ఐదేళ్లలో మళ్లీ పాత బరువుకు వచ్చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా '8,500 అడుగుల' సూత్రాన్ని పరిశోధకులు సూచిస్తున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ (ఈసీఓ 2026) సదస్సులో ఈ అధ్యయన వివరాలను వెల్లడించారు.

పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు..

మళ్లీ బరువు పెరగకుండా ఉండాలంటే రోజుకు ఇన్ని అడుగులు వేయాలి..
మళ్లీ బరువు పెరగకుండా ఉండాలంటే రోజుకు ఇన్ని అడుగులు వేయాలి..

దాదాపు 3,700 మందిపై జరిపిన ఈ విశ్లేషణలో శారీరక శ్రమకు, బరువు నియంత్రణకు మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

8,500 అడుగుల మ్యాజిక్ నంబర్: డైటింగ్ సమయంలోనే తమ శారీరక శ్రమను పెంచుకుని, రోజుకు సగటున 8,500 అడుగులు నడిచిన వారు.. డైటింగ్ పూర్తయ్యాక కూడా అదే బరువును కొనసాగించడంలో విజయవంతమయ్యారు.

Healthy Habits : ఈ చిన్ని చిన్న అలవాట్లే అనారోగ్యానికి కారణం! వెంటనే మానుకోండి..

డైటింగ్ వర్సెస్ నడక: బరువు తగ్గే ప్రారంభ దశలో అడుగుల సంఖ్య కంటే మనం తీసుకునే కేలరీలే (ఆహారం) ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే నడక వల్ల బరువు వేగంగా తగ్గకపోవచ్చు కానీ, ఆ తర్వాత తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా అడ్డుకోవడంలో నడక అత్యంత కీలకం.

స్థిరత్వమే ముఖ్యం: ఈ ప్రయోజనం కలగాలంటే నడకను ఒక అలవాటుగా మార్చుకోవాలి. నిలకడగా రోజుకు 8,200 నుంచి 8,500 అడుగులు వేసే వారు, వ్యాయామం చేయని వారి కంటే సగటున 3 కిలోల తక్కువ బరువుతో ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

ఎందుకు నడవాలి?

Heart health : మీ గుండె పదిలంగా ఉండాలంటే- ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇవి చేయాల్సిందే..

మీరు బరువు తగ్గాలనుకుంటే ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి. కానీ, తగ్గిన బరువును జీవితాంతం నిలబెట్టుకోవాలంటే మాత్రం రోజుకు 8,500 అడుగుల లక్ష్యాన్ని చేరుకోండి. ఇది ఎటువంటి ఖర్చు లేని, అత్యంత ప్రభావవంతమైన జీవనశైలి మార్పు అని గుర్తుపెట్టుకోవాలి.

బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్న రోజుకు 10వేల స్టెప్స్​ వేయాలని చెబుతుంటారు. అయితే, చాలా మందికి అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికి 8,500 స్టెప్స్​ వేసేందుకు ప్రయత్నిస్తే మంచిది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ప్రశ్న: బరువు తగ్గడానికి కేవలం నడక సరిపోతుందా?

సమాధానం: బరువు తగ్గడానికి ప్రాథమికంగా ఆహార నియమాలు (డైటింగ్) ముఖ్యం. అయితే తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా నిలకడగా ఉంచుకోవడానికి రోజువారీ నడక అత్యంత కీలకం.

2. ప్రశ్న: రోజుకు 8,500 అడుగులు అంటే ఎంత దూరం ఉంటుంది?

సమాధానం: సగటున ఒక వ్యక్తికి 8,500 అడుగులు అంటే సుమారు 5.5 నుంచి 6.5 కిలోమీటర్ల (సుమారు 4 మైళ్లు) దూరంతో సమానం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON