ఆగస్టులో పుట్టారా? మీలో దాగి ఉన్న ఈ 5 ప్రత్యేక లక్షణాలు తెలుసా!

ఆగస్టు నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వంలో ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎక్కువగా కనిపిస్తాయని న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం సూచిస్తాయి. వీరు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు, నిర్ణయాలను స్వయంగా తీసుకోవడాన్ని ఇష్టపడతారు. 

Published on: Jul 27, 2026, 11:00:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంవత్సరంలోని మిగతా నెలలతో పోలిస్తే ఆగస్టు నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వ శైలే వేరుగా ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్లినా యిట్టె అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అంకెలు, గ్రహాల గతులను విశ్లేషించే న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో జన్మించిన వారిలో అసాధారణమైన ఆత్మవిశ్వాసం, విషయాలను త్వరగా గ్రహించే శక్తి ఉంటాయి.

ఆగస్టులో పుట్టారా? మీలో దాగి ఉన్న ఈ 5 ప్రత్యేక లక్షణాలు తెలుసా! (pinterest)
ఆగస్టులో పుట్టారా? మీలో దాగి ఉన్న ఈ 5 ప్రత్యేక లక్షణాలు తెలుసా! (pinterest)

ఆగస్టులో పుట్టడం వల్ల వీరిపై సింహ, కన్య రాశుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీరు ఎక్కడికెళ్లినా తమదైన ముద్ర వేస్తారు. ముఖ్యంగా సవాళ్లను స్వీకరించడం వీరికి ఇష్టం. తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే, వీరు వ్యవహరించే తీరు కారణంగా కొందరు అపార్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.

నాయకత్వ లక్షణాలు మెండుగా..

ఆగస్టులో పుట్టిన వారు ఎప్పుడూ ఇతరులను అనుసరించడానికి ఇష్టపడరు. పదే పదే నలుగురిలో ఒకరిగా ఉండటం కంటే, ముందుండి నడిపించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఏ విషయంలోనైనా బాధ్యత తీసుకోవడానికి ముందుంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వీరు బెదిరిపోరు.

సమస్యను చూసి పారిపోకుండా, దానికి తగిన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. తమకున్న ఆత్మవిశ్వాసంతోనే జీవితంలో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో ఉన్న ఈ నాయకత్వ గుణాల కారణంగానే తోటి ఉద్యోగులు లేదా స్నేహితులు తరచుగా వీరి నుంచి సలహాలు కోరుతుంటారు.

బయటకు కఠినం.. లోపల వెన్న

ఆగస్టు నెలలో పుట్టిన వ్యక్తులు మొదటి చూపునకు ఎంతో కఠినంగా, సీరియస్‌గా కనిపిస్తారు. వారిని చూస్తే ఎవరితోనూ అంత త్వరగా కలవలేరనిపిస్తుంది. అయితే, పైకి అలా కనిపించినప్పటికీ తమ వారికి వచ్చేసరికి వీరి మనసు చాలా విశాలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కష్టమొస్తే వారికి సాయం చేయడానికి క్షణం కూడా ఆలోచించరు. తమ వాళ్ల వెన్నంటి నిలవడంలో వీరు ఎప్పుడూ ముందే ఉంటారు. బంధాల్లో నమ్మకానికీ, నిజాయితీకి ఇవి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.

ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు

వీరి ప్రత్యేకత ఏమిటంటే ఎంత పెద్ద సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయరు. ఏదైనా పనుల్లో విఫలమైతే కృంగిపోకుండా, మళ్లీ పట్టుదలతో విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎంతటి కష్టకాలంలోనూ ఆశను వదిలిపెట్టరు. ఈ పట్టుదల గుణమే వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.

ఈ స్వభావమే శత్రువులను చేస్తుంది

వీరిలో ఉండే ఒకే ఒక్క బలహీనత ఏమిటంటే మనసులో ఏది ఉంటే అది ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. విషయాలను ఎప్పుడూ దాచిపెట్టరు, గిట్టని వాళ్ల కోసం మాట మార్చరు. ఎదుటివారికి తప్పు అనిపించింది నేరుగా చెప్పేస్తారు. అయితే వీరు ఎవరి మనసైనా నొప్పించాలని అలా మాట్లాడరు.

కానీ వీరు చెప్పే విధానం వల్ల అవతల వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు. ఈ ఒక్క కారణం వల్లే కొందరు వీరు చెడ్డవారని భావిస్తారు, కొన్నిసార్లు బంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More