గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అశుభయోగాల్లో శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. నవంబర్ 23న తులా రాశితో శుక్రుడు, బుధుడు సంయోగం చెంది లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఈ శుభయోగం కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది.
లక్ష్మీనారాయణ యోగం

రాక్షసులకు గురువు, ప్రేమకు, సంపదకు కారకుడు అయినటువంటి శుక్రుడు, సొంత రాశి అయినటువంటి తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు నవంబర్ 23, ఆదివారం సాయంత్రం 7:58కి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో బుధ, శుక్ర కలయిక ఏర్పడుతుంది. ఇది లక్ష్మీనారాయణ రాజయోగాన్ని తీసుకొస్తుంది.
ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చినా, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? లక్ష్మీనారాయణ యోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.
లక్ష్మీనారాయణ రాజయోగంతో, ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలని అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది.
2.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ప్రమోషన్ రావచ్చు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3.తులా రాశి
{{/usCountry}}మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ప్రమోషన్ రావచ్చు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3.తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఎంతో కలిసివస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవకాశాలు ఉన్నాయి.
4.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ యోగం బాగా కలిసొస్తుంది. శుక్రుడు, బుధ సంయోగం ఆర్థికపరంగా విజయాలను అందిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
5.మకర రాశి
మకర రాశి వారికి ఈ యోగం సానుకూల మార్పులు తీసుకొస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు అనుకున్నవి పూర్తవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.