జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు, నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ధైర్యానికి, శౌర్యానికి, శక్తికి కారకుడైన అంగారకుడు (కుజుడు) జూలై నెలలో రెండు సార్లు పెద్ద మార్పులకు లోనవుతున్నాడు. ప్రస్తుతం జూలైలో నక్షత్ర సంచారం చేస్తున్న కుజుడు.. వచ్చే నెలలో బుధుడికి చెందిన మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారక గ్రహానికి సంబంధించిన ఈ రెండు మార్పులు కొన్ని రాశుల వారికి అత్యంత అద్భుతమైన యోగాలను తీసుకురానున్నాయి.
ముఖ్యంగా రాబోయే జూలై 24వ తేదీన కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడే కావడం వల్ల, ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి వరంలా మారనుంది. ఈ విషయమై ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రత్యేక విశ్లేషణను అందించారు.
జ్యోతిష్య నిపుణుడు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం... అంగారక గ్రహం తన సొంత నక్షత్రంలో సంచరించడం చాలా శుభప్రదమైన పరిణామం. జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి తన సొంత నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు వ్యక్తి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రస్తుత గ్రహాల స్థితిని పరిశీలిస్తే, కుజుడి స్థానం చాలా బలంగా ఉంది. ఇది మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి, ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
ఈ నక్షత్ర సంచారంతో దాదాపు అన్ని రాశుల వారిలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే, కుజుడి మృగశిర నక్షత్ర ప్రవేశం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి స్పష్టమైన, భారీ ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్యశాస్త్రంలో ఐదవ నక్షత్రమైన మృగశిర.. వృషభం, మిథున రాశులలో విస్తరించి ఉంటుందని మనకు తెలుసు.
ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ్ వివరణ ప్రకారం.. కుజుడి నక్షత్ర సంచారం వల్ల అత్యధిక ప్రయోజనాలు పొందే ఆ మూడు రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం:
- మేష రాశి : కుజుడి సొంత రాశి అయిన మేష రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఆర్థిక పరిస్థితి నిలకడగా మారుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి.
- కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ కాలం ఒక వరంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో గత కొంతకాలంగా నడుస్తున్న విభేదాలు, మనస్పర్థలు పూర్తిగా తొలిగిపోయి బంధం బలపడుతుంది.
- వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కార్యాలయంలో పెద్ద బాధ్యతలు లేదా ఉన్నత పదవులు మిమ్మల్ని వరిస్తాయి.

ఈ మూడు రాశుల వారికే కాకుండా, మిగిలిన రాశుల వారికి కూడా ఈ సంచారం వల్ల పెద్దగా నష్టమేమీ జరగదు. అయితే…. ఇతర రాశుల వారు తమ శక్తిని మంచి పనుల కోసం, సృజనాత్మక పనుల కోసం ఉపయోగించుకోవాలని, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.