కుజుడి నక్షత్ర సంచారం - జూలై 24 నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టం, సిరిసంపదలు!

జ్యోతిష్యశాస్త్రంలో కీలకమైన అంగారక గ్రహం జూలై 24న మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనుంది. ప్రముఖ జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం…. ఈ సంచారం మేషం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారికి విపరీతమైన ధనలాభాన్ని, విజయాన్ని అందిస్తుంది.

Published on: Jul 9, 2026, 14:10:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
కుజుడి నక్షత్ర సంచారం
కుజుడి నక్షత్ర సంచారం

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు, నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ధైర్యానికి, శౌర్యానికి, శక్తికి కారకుడైన అంగారకుడు (కుజుడు) జూలై నెలలో రెండు సార్లు పెద్ద మార్పులకు లోనవుతున్నాడు. ప్రస్తుతం జూలైలో నక్షత్ర సంచారం చేస్తున్న కుజుడు.. వచ్చే నెలలో బుధుడికి చెందిన మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారక గ్రహానికి సంబంధించిన ఈ రెండు మార్పులు కొన్ని రాశుల వారికి అత్యంత అద్భుతమైన యోగాలను తీసుకురానున్నాయి.

ముఖ్యంగా రాబోయే జూలై 24వ తేదీన కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడే కావడం వల్ల, ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి వరంలా మారనుంది. ఈ విషయమై ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రత్యేక విశ్లేషణను అందించారు.

జ్యోతిష్య నిపుణుడు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం... అంగారక గ్రహం తన సొంత నక్షత్రంలో సంచరించడం చాలా శుభప్రదమైన పరిణామం. జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి తన సొంత నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు వ్యక్తి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రస్తుత గ్రహాల స్థితిని పరిశీలిస్తే, కుజుడి స్థానం చాలా బలంగా ఉంది. ఇది మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి, ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.

నక్షత్ర సంచారంతో దాదాపు అన్ని రాశుల వారిలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే, కుజుడి మృగశిర నక్షత్ర ప్రవేశం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి స్పష్టమైన, భారీ ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్యశాస్త్రంలో ఐదవ నక్షత్రమైన మృగశిర.. వృషభం, మిథున రాశులలో విస్తరించి ఉంటుందని మనకు తెలుసు.

ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ్ వివరణ ప్రకారం.. కుజుడి నక్షత్ర సంచారం వల్ల అత్యధిక ప్రయోజనాలు పొందే ఆ మూడు రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం:

  • మేష రాశి : కుజుడి సొంత రాశి అయిన మేష రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఆర్థిక పరిస్థితి నిలకడగా మారుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి.
  • కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ కాలం ఒక వరంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో గత కొంతకాలంగా నడుస్తున్న విభేదాలు, మనస్పర్థలు పూర్తిగా తొలిగిపోయి బంధం బలపడుతుంది.
  • వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కార్యాలయంలో పెద్ద బాధ్యతలు లేదా ఉన్నత పదవులు మిమ్మల్ని వరిస్తాయి.

ఈ మూడు రాశుల వారికే కాకుండా, మిగిలిన రాశుల వారికి కూడా ఈ సంచారం వల్ల పెద్దగా నష్టమేమీ జరగదు. అయితే…. ఇతర రాశుల వారు తమ శక్తిని మంచి పనుల కోసం, సృజనాత్మక పనుల కోసం ఉపయోగించుకోవాలని, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More