...
...
Next Story

రక్షాబంధన్ రోజు ఈ రంగుల దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు.. మీ రాశి ఏ రంగో చూడండి!

రక్షాబంధన్ 2026: ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 28న వచ్చింది. పండుగ రోజున మీ రాశికి అనుకూలమైన రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభ ఫలితాలను, అదృష్టాన్ని పొందవచ్చు.

Published on: Aug 26, 2026, 16:00:28 IST
Advertisement

రక్షాబంధన్ వచ్చేస్తోంది. రక్షాబంధన్‌కి అందరూ కూడా ప్రిపరేషన్స్‌ను మొదలు పెట్టేసి ఉంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 28న వచ్చింది. అయితే, ఈ రక్షాబంధన్ రోజున ఏ రాశుల వారికి ఏ రంగు కలిసొస్తుంది? ఏ రాశుల వారు ఏ రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

రక్షాబంధన్ 2026.. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరికి ఏ రంగు అదృష్టం తీసుకొస్తుంది?

రక్షాబంధన్ రోజు ఈ రంగుల్లో దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు.. మీ రాశి ఏ రంగో చూడండి! (gemini ai)
రక్షాబంధన్ రోజు ఈ రంగుల్లో దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు.. మీ రాశి ఏ రంగో చూడండి! (gemini ai)

మేష రాశి: మేష రాశి వారికి ఎరుపు లేదా స్కార్లెట్ బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. శక్తి, ఉత్సాహం, ధైర్యానికి ప్రతీక కుజుడు. ఈ రాశి వారు ఈ రంగులను ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృషభ రాశి: వృషభ రాశి వారు తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందం, సౌకర్యం, మాధుర్యానికి ప్రతీక. తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది.

మిథున రాశి: మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు ఆకుపచ్చ లేదా లైమ్ గ్రీన్ ధరిస్తే బాగా కలిసి వస్తుంది. పెసలు లేదా ఆకుపచ్చ గాజులను దానం చేయడం కూడా మంచిదే.

కర్కాటక రాశి: ఈ రాశికి అధిపతి చంద్రుడు. వెండి లేదా తెలుపు రంగు దుస్తులను ధరిస్తే ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శివలింగానికి పాలల్లో బియ్యం కలిపి అభిషేకం చేయండి.

కన్య రాశి: కన్య రాశి వారికి లేత గోధుమ లేదా ఎమరాల్డ్ గ్రీన్ బాగా కలిసి వస్తాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఆకుపచ్చ దుస్తులను లేదా విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం మంచిది.

తులా రాశి: రక్షాబంధన్ రోజున ఈ రాశి వారు లేత గులాబీ లేదా ఆకాశ నీలం దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. మెరూన్ లేదా ముదురు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశికి అధిపతి గురువు. పసుపు లేదా మస్టర్డ్ ఎల్లో దుస్తులను ధరిస్తే ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.

మకర రాశి: మకర రాశి వారు నేవీ బ్లూ లేదా బూడిద రంగు దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి శని.

కుంభ రాశి: కుంభ రాశి వారు బ్లూ లేదా వైలెట్ రంగులు ధరిస్తే బాగా కలిసి వస్తుంది. శని, రాహువు ప్రభావం ఈ రాశి వారిపై ఉంటుంది.

మీన రాశి: మీన రాశి వారు సీ గ్రీన్ లేదా లావెండర్ రంగు దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. గురువు ప్రభావం వలన ఆధ్యాత్మికత, ప్రశాంతతను పెంపొందించుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe