ఈరోజు పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. పరాభవనమ సంవత్సరంలో 12 రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి భవిష్యత్తుతో పాటు మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఏ నెలలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది?

జూన్ నుంచి గురువు పంచమ స్థానంలో, శని ఒకటవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా 12వ స్థానంలో, ఆ తర్వాత లాభ స్థానంలో, కేతువు డిసెంబర్ దాకా ఆరవ స్థానంలో, తర్వాత పంచమ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మధ్యస్థ నుంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, గురువు, రాహువు, కేతువు లాంటి గ్రహాలు అనుకూలంగా ఉండడంతో బాగుంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పెట్టుబడులు పెట్టేటప్పుడు అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి
మీన రాశి వారికి రాజకీయ ఒత్తిడి వలన కొంత ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పురోగతి, అభివృద్ధిని చూస్తారు. మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సినీ, మీడియా రంగాల వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలకు బాగా కలిసి వస్తుంది.
పరిహారాలు:
మీన రాశి వారికి పరాభవ సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలయంలో శనికి తైలాభిషేకం చేస్తే మంచిది. దశరథ ప్రోక్త, శని స్తోత్రాన్ని పఠించండి. ఇక నెలల వారీగా ఫలితాలు చూద్దాం.
మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది?
ఏప్రిల్ 2026:
{{/usCountry}}మీన రాశి వారికి పరాభవ సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలయంలో శనికి తైలాభిషేకం చేస్తే మంచిది. దశరథ ప్రోక్త, శని స్తోత్రాన్ని పఠించండి. ఇక నెలల వారీగా ఫలితాలు చూద్దాం.
మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది?
ఏప్రిల్ 2026:
{{/usCountry}}ఈ నెల మీకు వృత్తి, ఉద్యోగ పరంగా సాధారణంగా ఉంటుంది. బంధువులతో విరోధాలు ఉంటాయి. ప్రయత్నాలు నెరవేరవు. ఉద్యోగస్తులకు అధికారులతో ఇబ్బందులు కలుగుతాయి. ప్రమోషన్లు లేక ఇబ్బంది పడతారు.
మే 2026:
ఈ నెల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.
జూన్ 2026:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని వలన ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అభివృద్ధి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరంగా లాభాలను చూస్తారు. స్త్రీలకు ధన లాభం కలుగుతుంది.
జూలై 2026:
ఈ నెల మీకు పెద్దగా అనుకూలంగా ఉండదు. బంధువులతో ఇబ్బందులు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధిని చూస్తారు. స్త్రీలకు ఆర్థిక లాభం. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
ఆగస్టు 2026:
ఈ నెల మీకు అనుకూలంగా లేదు. అస్తమ కుజుని కారణంగా అనారోగ్యం కలుగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలసట ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు.
సెప్టెంబర్ 2026:
ఈ నెల మీకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. స్త్రీలకు అనుకూలంగానే ఉంటుంది.
అక్టోబర్ 2026:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా బాగుంటుంది. ఆర్థిక లాభాలను చూస్తారు. కొత్త స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయికతో ఆనందం ఉంటుంది.
నవంబర్ 2026:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు ఖర్చు చేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. గురువు మార్పు కారణంగా కొంత ఇబ్బందులు రావచ్చు. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది.
డిసెంబర్ 2026:
ఈ నెల మీకు అనుకూలంగా లేదు. శుభకార్యాలు వాయిదా వేస్తారు. స్త్రీలకు ఇబ్బందులు కలుగుతాయి. దైవదర్శనం వలన ఆనందం ఉంటుంది.
జనవరి 2027:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు వస్తారు. ఆకస్మిక ధన లాభాన్ని చూస్తారు. శత్రువులను గుర్తించి వారిని ఇబ్బంది పెడతారు. స్త్రీలకు ధన లాభం కలుగుతుంది.
ఫిబ్రవరి 2027:
ఈ నెల మీకు అనుకూలంగా లేదు. స్త్రీల వలన ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. కోపం, అలసట ఎక్కువగా ఉంటాయి.
మార్చి, ఏప్రిల్ 2027:
ఈ రెండు నెలలు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రుల కారణంగా లాభం ఉంటుంది. ఊహించని దాని కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. వృత్తి, ఉద్యోగ పరంగా బాగుంటుంది.