సిరి సంపదల అధిపతి ‘శుక్రుడి’ నక్షత్ర సంచారం.. నేటి నుంచి ఈ 3 రాశుల జాతకం పూర్తిగా మారిపోతుంది
వైభోగానికి, ఆకర్షణకు కారకుడైన శుక్ర గ్రహం తన నడకను మార్చుకోనుంది. సూర్యుడి నక్షత్రమైన కృత్తికలోకి శుక్రుడి ప్రవేశంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. నేటి నుంచి ఈ 3 రాశుల జాతకం పూర్తిగా మారిపోతుంది. ఈ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మన జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా విలాసవంతమైన జీవితానికి, ఆర్థిక స్థితిగతులకు కారకుడైన శుక్రుడు (Venus) ప్రస్తుతం మేష రాశిలో భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే, ఏప్రిల్ 16, 2026 అనగా ఈరోజు శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చుకుని, సూర్యుడికి చెందిన కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.

ఈ సమాచారం ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాధారణంగా సూర్యుడు అధికారానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయితే, శుక్రుడు భోగభాగ్యాలకు చిహ్నం. సూర్యుడి నక్షత్రంలో శుక్రుడి సంచారం అనేది అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా కొన్ని రాశుల వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఆర్థిక బలాన్ని నింపుతుంది. ఈ 12 రోజుల కాలంలో ఏయే రాశుల వారు లాభపడనున్నారో ఇప్పుడు విశ్లేషిద్దాం.
మేష రాశి: పట్టినదల్లా బంగారమే
మేష రాశిలోనే శుక్రుడి ఈ మార్పు జరుగుతుండటం వల్ల వీరికి తిరుగులేని ఫలితాలు రాబోతున్నాయి. మీరు చేసే చిన్నపాటి ప్రయత్నం కూడా ఊహించని విజయాలను తెచ్చిపెడుతుంది. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో కొత్త శక్తిని గమనిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఏకాగ్రతతో పని చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
సింహ రాశి: వ్యాపారంలో లాభాల వర్షం
సింహ రాశికి అధిపతి సూర్యుడు. శుక్రుడు సూర్యుడి నక్షత్రంలోకి రావడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం పట్టినట్లే. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త డీల్స్ కుదుర్చుకుంటే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో మొండి బాకీలు వసూలవుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు లేదా విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ధనస్సు రాశి: పెట్టుబడులకు సరైన సమయం
ధనస్సు రాశి వారికి శుక్రుడి ఈ నక్షత్ర మార్పు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. భవిష్యత్తులో ఇవి భారీ లాభాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది.
ఆఫీసులో మీ పనితీరుకు పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. జీతాల పెంపు లేదా ప్రమోషన్ వంటి వార్తలు వినే అవకాశం ఉంది. మొత్తానికి, ఏప్రిల్ 16 నుండి 27 వరకు ఉన్న ఈ సమయం ఈ మూడు రాశుల వారికి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. ఈ సమయంలో మీ శ్రమను నమ్ముకుని అడుగులు వేస్తే ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


