సర్ ప్రక్రియపై రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని, దేశ యువతను అనవసరంగా రెచ్చగొడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోనే ఎదుర్కొనేందుకు తెలంగాణ బీజేపీ నాయకత్వం…. భారీ పాదయాత్రకు సమరభేరి పూరించింది.
నవంబర్ 2వ తేదీన హైదరాబాద్ నగరంలో జరగనున్న ఈ పాదయాత్రకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో "ఓట్ చోరీ" పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక ర్యాలీ నిర్వహిస్తున్న మరుసటి రోజే భాజపా ఈ పాదయాత్ర చేపడుతుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజానికి అమిత్ షా తెలంగాణ పర్యటన గత రెండున్నరేళ్లుగా అనేకసార్లు వాయిదాపడింది. ఈ నెల 3, 4వ తేదీల్లోనే ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా… ఆఖర్లో రద్దయ్యింది. ఆ పర్యటనలో మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తిచేయగా.. అనూహ్యంగా పర్యటన రద్దు చేసుకున్నారు.
అమిత్ షా చివరిసారిగా తెలంగాణకు మే 2024లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో షా రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటనలు రద్దయ్యాయి. తాజాగా టూర్ షెడ్యూల్ ఖరారు కావటంతో… పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు.
కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది - రాంచందర్ రావు
హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలపై మండిపడ్డారు. "రాష్ట్రంలోనూ, దేశంలోనూ అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. అందుకే 'లోక్తంత్ర బచావో - అరాజకతా హటావో' (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - అరాచకాన్ని నిరోధించండి) అనే నినాదంతో మేము భారీ పాదయాత్రను చేపడుతున్నాం. ఈ యాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొంటారు" అని రాంచందర్ రావు వివరించారు.
{{/usCountry}}హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలపై మండిపడ్డారు. "రాష్ట్రంలోనూ, దేశంలోనూ అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. అందుకే 'లోక్తంత్ర బచావో - అరాజకతా హటావో' (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - అరాచకాన్ని నిరోధించండి) అనే నినాదంతో మేము భారీ పాదయాత్రను చేపడుతున్నాం. ఈ యాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొంటారు" అని రాంచందర్ రావు వివరించారు.
{{/usCountry}}ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సాధారణ 'చాయ్‌వాలా' దేశానికి ప్రధానమంత్రి కావడం కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 2014 నుంచి వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో రగిలిపోతోందని అన్నారు. ఖార్గే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఓటర్ల తొలగింపుపై సవాల్
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR)పై కాంగ్రెస్ కావాలనే అబద్ధాలను ప్రచారం చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఆయన నేరుగా ఒక సవాల్ విసిరారు. "ముఖ్యమంత్రి సొంత ఊరు కొండరెడ్డిపల్లెకు నాతో రావడానికి రేవంత్ రెడ్డి సిద్ధమా? అక్కడ ఎంతమంది అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయో కలిసి పరిశీలిద్దాం" అని సవాలు చేశారు.
ఒకవేళ సవరణ సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఏవైనా పేర్లు తొలగించబడినా, నిజమైన అర్హులైన ఓటర్లకు తమ పేర్లను మళ్లీ చేర్చుకునే అవకాశం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా SIR ద్వారా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను రాంచందర్ రావు ఖండించారు. ఎన్నికల నిబంధనల్లో 'ASDD' (లేనివారు, నివాసం మారినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లు) వర్గం కింద మాత్రమే ఈ పేర్లు తొలగిపోతాయని వివరించారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర నీటి కొరత ఏర్పడి, సుమారు 600 మండలాలకు గాను 300కు పైగా మండలాలు కరువు ఛాయల్లో చిక్కుకున్నాయని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాజధాని హైదరాబాద్ నగరంలో రోజుకు 8,000 నీటి ట్యాంకర్లు బుక్ అవుతున్న దుస్థితి నెలకొందన్నారు.
రాష్ట్రం ఇలాంటి తీవ్ర నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడం వదిలేసి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ర్యాలీకి గుంపులుగా వెళ్లడం ఏంటని ఆయన తీవ్రంగా నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.