ఓటర్ల సవరణ ప్రక్రియ (SIR)పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నాయకత్వం భారీ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి రానున్నారు.

ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో 'ఓట్ బచావో' పేరిట ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై దేశద్రోహం మోపి జైలుకు పంపుతామని…. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు చట్టం నుంచి తప్పించుకోలేరని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జరిగే పాదయాత్ర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ విమర్శలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.
పాదయాత్ర రూట్ ఇలా….
ఇవాళ మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొజంజాహి మార్కెట్ (MJ మార్కెట్) వరకు సాగుతుంది. యాత్ర ముగింపులో మొజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.
ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావులు ఆదివారం స్వయంగా పాదయాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాత్ర విజయవంతం కావడానికి అవసరమైన భద్రతా చర్యలు, రూట్ మ్యాప్, సభా ఏర్పాట్లపై అధికారులతో, పార్టీ శ్రేణులతో సమీక్షించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ…. ఈ యాత్రలో న్యాయవాదులు, వైద్యులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ వ్యాప్తి చేస్తున్న రాజకీయ అబద్ధాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను కాపాడటమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
{{/usCountry}}బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ…. ఈ యాత్రలో న్యాయవాదులు, వైద్యులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ వ్యాప్తి చేస్తున్న రాజకీయ అబద్ధాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను కాపాడటమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
{{/usCountry}}