...
...
Next Story

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు - సీఎం రేవంత్ రెడ్డి

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించారు.

Published on: Sep 28, 2026, 22:04:18 IST
Advertisement

ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పాలించాలనే నిర్ణయాధికారం పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ప్రాథమిక మూలస్తంభమని ఆయన ఉద్ఘాటించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీలో అసోం ప్రముఖ దినపత్రిక ‘ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్’ నిర్వహించిన ‘ది కాన్క్లేవ్ 2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ‘ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్’ అనే అంశంపై జరిగిన ముఖాముఖి చర్చలో దేశ భవిష్యత్తు దిశ తెన్నులు, విద్యా సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (RRR), నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ఓటర్ల జాబితా సవరణ (SIR) సహా అనేక కీలక అంశాలపై ఆయన విస్తృతంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

దేశవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఓటర్ల సంఖ్యలో తగ్గుదల నమోదు కావడం వెనుక ఉన్న కారణాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, అర్హతల నిర్ధారణ వంటి సున్నితమైన ప్రక్రియలు అత్యంత పారదర్శకంగా, సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండాలని అధికారులను కోరారు. ఓటు హక్కు పరిరక్షణ విషయంలో పౌరుల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిష్పాక్షిక చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.

దక్షిణాదికి అన్యాయం జరగొద్దు - సీఎం

పార్లమెంటరీ రాజకీయాల్లో సంఖ్యాబలమే కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషించిన సీఎం, లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య తగ్గితే జాతీయ విధానాల రూపకల్పనలో దక్షిణాది వాదన బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏదైనా ఒక రాష్ట్రంలో ఉన్న వనరులు, మానవ సామర్థ్యాలను బట్టి ఆ రాష్ట్రాన్ని అక్కడికక్కడే అభివృద్ధి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు. కేంద్రం నుంచి సరైన సహకారం, నిధుల మద్దతు లభిస్తే తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

విద్యా వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధి, విదేశీ పెట్టుబడులు మరియు మౌలిక వసతుల కల్పన ప్రాతిపదికన తెలంగాణను అభివృద్ధి చేసి, దేశ ఆర్థిక ప్రగతిలో రాష్ట్రాన్ని ప్రథమ వరసలో నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యువతకు కేవలం డిగ్రీ పట్టాలే కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగ నైపుణ్యాలను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks