ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. హెల్త్ వీక్‌లో రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ వీక్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేలా, ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు ఉండాలని మంత్రి సూచించారు. హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ విద్యార్థులు, మహిళలు, యువతను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు.
హెల్త్ వీక్ - చేపట్టే కార్యక్రమాలు :
- ఆహార నాణ్యత ప్రాముఖ్యతను తెలిపేలా ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద ఈట్ రైట్ వాక్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.00 నుంచి నేచురోపతి హాస్పిటల్‌లో 40 స్టాళ్లతో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సర్టిఫికేట్ల పంపిణీ, హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ల పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాల్లో కూడా ఉదయం ఈట్ రైట్ వాక్‌లు, మధ్యాహ్నం ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళాలు ఉంటాయి.
- ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కేన్సర్ పేషెంట్లకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిమ్స్‌లో ఏర్పాటు చేసిన అధునాతన LINAC యంత్రాన్ని ఉదయం 10 గంటలకు మంత్రి దామోదర ప్రారంభిస్తారు. ఆ తర్వాత రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఇందులో తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ ప్రారంభం, ట్రామా కేర్ పాలసీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్, PC అండ్ PNDT, ART సరోగసీ పోర్టల్స్ ప్రారంభం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి.
- అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరంఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు.
- ఏప్రిల్ 8న సేఫ్ మదర్ డేగా నిర్వహిస్తూ ఉదయం 11.00 గంటలకు బోయిగూడలోని మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాల్లో ANC పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ప్రసూతి సేవలపై వర్క్‌షాప్‌ల నిర్వాహణ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పిస్తారు.
- ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్‌లో రెడ్ రన్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో కూడా ఇదే సమయానికి అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. జైళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌లో వైద్య సేవలు, ఉచిత పరీక్షలు ఉంటాయి.
- ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయూష్ డేగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమాలుంటాయి. ఉదయం 11.00 గంటలకు హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, వైద్య శిబిరాలు విస్తృతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.
- ఏప్రిల్ 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డేగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11న మెడిసిన్ సేఫ్టీ, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి గాంధీ హాస్పిటల్ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని మంత్రి దామోదర ఆదేశించారు.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}