కర్ణాటక దక్షిణ తీర ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు, భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రకటిచింది. శృంగేరి శారదాంబ పీఠం, గోకర్ణ మహాబలేశ్వర ఆలయం, మురుడేశ్వరం, ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, హోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయాలను సందర్శించేందుకు 'కోస్టల్ కర్ణాటక' (Package Code: SHR085) పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.
6 రోజుల టూర్ షెడ్యూల్ వివరాలు :

5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ యాత్ర…. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 10వ తేదీన అందుబాటులో ఉంది. ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
- మొదటి రోజు : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు రైలు (నంబరు 12789 'కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలులోనే ప్రయాణిస్తారు.
- రెండో రోజు : ఉదయం 09:15 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉడిపికి తీసుకెళ్తారు. ఉడిపిలోని హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని, అందమైన మాల్పే బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రికి ఉడిపిలోనే బస చేస్తారు.
- మూడో రోజు : ఉదయాన్నే గోకర్న క్షేత్రానికి బయలుదేరి మహాబలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుడి విగ్రహం ఉన్న మురుడేశ్వరం చేరుకుంటారు. ఆ తర్వాత కొల్లూరు మూకాంబిక దేవి ఆలయాన్ని దర్శించుకుని…. తిరిగి ఉడిపి చేరుకుని రాత్రి బస చేస్తారు.
- నాలుగో రోజు : హోటల్ చెకౌట్ చేసి హోరనాడులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం శృంగేరి చేరుకుని శ్రీ శారదాంబ దేవిని దర్శించుకుంటారు. సాయంత్రం మంగళూరు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.
- ఐదో రోజు : హోటల్ చెకౌట్ చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి మంగళూరు చేరుకుని రాత్రి 19:00 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో దిగుతారు. రాత్రి 20:00 గంటలకు రైలు నంబరు 12790 ద్వారా తిరుగు ప్రయాణం అవుతారు.
- ఆరో రోజు : రాత్రి 23:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరల వివరాలు
ఈ ప్యాకేజీలో 3 ఏసీ (కంఫర్ట్), స్లీపర్ (స్టాండర్డ్) తరగతులలో ప్రయాణించే సదుపాయం ఉంది. టికెట్ ధరలు చూస్తే…. 3 ఏసీలో 1 నుంచి 3 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు (ఒక్కొక్కరికి) ట్విన్ షేరింగ్‌కు రూ. 23,910, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 19,240, సింగిల్ షేరింగ్‌కు రూ. 41,930 గా నిర్ణయించారు. 5-11 సంవత్సరాల పిల్లలకు బెడ్‌తో రూ. 9,810, బెడ్ లేకుండా రూ. 8,600 ఉంటుంది.
{{/usCountry}}ఈ ప్యాకేజీలో 3 ఏసీ (కంఫర్ట్), స్లీపర్ (స్టాండర్డ్) తరగతులలో ప్రయాణించే సదుపాయం ఉంది. టికెట్ ధరలు చూస్తే…. 3 ఏసీలో 1 నుంచి 3 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు (ఒక్కొక్కరికి) ట్విన్ షేరింగ్‌కు రూ. 23,910, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 19,240, సింగిల్ షేరింగ్‌కు రూ. 41,930 గా నిర్ణయించారు. 5-11 సంవత్సరాల పిల్లలకు బెడ్‌తో రూ. 9,810, బెడ్ లేకుండా రూ. 8,600 ఉంటుంది.
{{/usCountry}}స్టాండర్డ్ (స్లీపర్) క్లాస్ లో అయితే…. ట్విన్ షేరింగ్‌కు రూ. 20,850. ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 16,180, సింగిల్ షేరింగ్‌కు రూ. 38,870 గా నిర్ణయించారు. పిల్లలకు బెడ్‌తో రూ. 6,750, బెడ్ లేకుండా రూ. 5,540 చెల్లించాలి.
రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3AC), ఏసీ వాహనంలో రవాణా, 3 రాత్రుల హోటల్ బస, 3 రోజులు ఉదయం అల్పాహారం , ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్-పార్కింగ్ ఛార్జీలు, జీఎస్టీ ఈ ప్యాకేజీలోనే కలిసి ఉంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్ ధరలతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.