TG Land Resurvey 2026 : తెలంగాణలో భూముల రీసర్వే - వచ్చే నెల నుంచే ప్రారంభం, తొలి దశలో 2240 గ్రామాలు

Telangana Land Resurvey 2026 : భూవివాదాలు లేని  లక్ష్యంగా వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే ప్రారంభం కానుంది. తొలి దశలో 2240 గ్రామాలను ఎంపిక చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Published on: Jun 19, 2026, 17:58:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Land Resurvey 2026 : రాష్ట్రంలో భూసమస్యలు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

తెలంగాణలో భూముల రీసర్వే
తెలంగాణలో భూముల రీసర్వే

శుక్రవారం రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల నుంచి జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

  • భూవివాదాల పరిష్కారంలో భాగంగా రాష్ట్రంలో నిజాం కాలం నుంచి నక్షాలు (మ్యాప్‌లు) లేని 378 గ్రామాలను రెవెన్యూ శాఖ గుర్తించింది.
  • వీటిలో ఇప్పటికే 5 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి విజయవంతంగా భూదార్ నంబర్లను కూడా కేటాయించారు.
  • మిగిలిన 373 గ్రామాల్లో కూడా రోవర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతతో సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
  • సర్వే కోసం గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాతకాలపు సాంకేతిక పరికరాలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. వీటికి బదులుగా డీజీపీఎస్ (DGPS), రోవర్స్, జీఐఎస్ (GIS), క్యూజీఐఎస్ (QGIS) వంటి గ్లోబల్ టెక్నాలజీని వినియోగిస్తూ శాస్త్రీయ పద్ధతిలో భూముల సర్వే నిర్వహిస్తున్నారు.
  • ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేయగా, త్వరలోనే మరో 400 ఆధునిక రోవర్లను సేకరించడానికి సిద్ధమవుతోంది.
  • భూముల రీసర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి ఖచ్చితమైన సరిహద్దులను నిర్ణయిస్తారు. అనంతరం ప్రతి సర్వే నంబర్‌కు ఒక ప్రత్యేక 'భూదార్' (Bhuudaar) నంబర్‌ను కేటాయిస్తారు.
  • డీజీపీఎస్ ద్వారా క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి, ప్రతి రికార్డును ప్రతిష్టాత్మక 'భూ భారతి' పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.
  • 1948 నాటికి తెలంగాణ ప్రాంతంలో సుమారు 40 లక్షల సర్వే నంబర్లు మాత్రమే ఉండగా…. ప్రస్తుతం అవి 2 కోట్ల 29 లక్షలకు పెరిగాయి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More