...
...
Next Story

PJTAU Agriculture Admissions 2026 : బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - షెడ్యూల్ వివరాలు

PJTAU Agriculture Admission 2026 : ఆచార్య జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) నుంచి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను బైపీసీ స్ట్రీమ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. జూలై 25 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 3, 2026, 12:55:35 IST
Advertisement

రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ ద్వారా వర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో కింది కోర్సులను భర్తీ చేయనున్నారు…

  • బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ : ఈ నాలుగేళ్ల కోర్సులో రెగ్యులర్ కోటా కింద 855 సీట్లు, స్పెషల్ కోటా కింద 500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాజేంద్రనగర్, అశ్వారావుపేట, జగిత్యాల, పాలెం, వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, హుజూర్‌నగర్, నిజామాబాద్, కొడంగల్ కళాశాలల్లో ఈ సీట్లను కేటాయిస్తారు.
  • బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) : నిజామాబాద్ జిల్లా రుద్రూరులోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో రెగ్యులర్ కింద 25 సీట్లు, స్పెషల్ కోటా కింద 4 సీట్లు భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు

  • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ : జూలై 24, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
  • పూర్తి చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : జూలై 25, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
  • దరఖాస్తుల సవరణకు (కరెక్షన్ విండో) అవకాశం : జూలై 27, 2026 (ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 వరకు)

తెలంగాణ ఈఏపీసెట్ - 2026 (TS EAPCET-2026) అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే అడ్మిషన్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 31 డిసెంబర్ 2026 నాటికి కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి సాధారణ అభ్యర్థులకు 22 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, శారీరక వికలాంగులకు 27 ఏళ్లుగా నిర్ణయించారు.

ఫీజుల వివరాలు కౌన్సెలింగ్ సమయంలో ఎంపికైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ కోటా విద్యార్థులకు మొదటి సెమిస్టర్ అడ్మిషన్ ఫీజు మొత్తం రూ. 50,740 గా ఉంది. స్పెషల్ కోటా కింద సీటు పొందిన విద్యార్థులు రూ. 1,12,790 చెల్లించాలి. ఇందులో ట్యూషన్ ఫీజు, లాబొరేటరీ, లైబ్రరీ మరియు హాస్టల్ డిపాజిట్లు కలిసి ఉంటాయి. సీట్ల వివరాలతో పాటు రుసుములు, ఇతర సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ www.pjtau.edu.in సందర్శించాలని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks