...
...
Next Story

తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు, మరికొన్ని పొడిగింపు..!

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్-చర్లపల్లి, బరౌని-బెంగళూరు మధ్య వన్‌-వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే చర్లపల్లి-దానాపూర్ ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

Published on: Nov 14, 2026, 10:25:01 IST
Advertisement

రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అదనపు డిమాండ్‌కు అనుగుణంగా హెచ్.ఎస్. నాందేడ్ - చర్లపల్లి, బరౌని - ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య వన్‌-వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

దీనితో పాటు చర్లపల్లి - దానాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ రైళ్ల తేదీలు, హాల్టింగ్ స్టేషన్లు, బోగీల వివరాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

నాందేడ్ - చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం. 07798):

  • ఈ ప్రత్యేక రైలు 2026 నవంబర్ 26న (గురువారం) ఒక్క ట్రిప్పు మాత్రమే నడుస్తుంది.
  • ఆగే స్టేషన్లు : ముద్ఖేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, అక్కన్నపేట, మిర్జాపల్లి, వడియారం, మేడ్చల్, బొల్లారం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
  • కోచ్‌ల వివరాలు : ఇందులో సెకండ్ ఏసీ (2AC), థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి.

బరౌని - బెంగళూరు ప్రత్యేక రైలు (నెం. 05250):

ఈ వన్‌-వే ప్రత్యేక రైలు 2026 నవంబర్ 20న (శుక్రవారం) ఒక్క ట్రిప్పు నడుస్తుంది.

  • ఆగే స్టేషన్లు : షాపూర్ పటోరీ, హాజీపూర్, సోన్‌పూర్, పాటలీపుత్ర, దానాపూర్, ఆరా, బక్సర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకీ, మాణిక్‌పూర్, సత్నా, కట్నీ, నర్సింగ్‌పూర్, పిపారియా, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్హర్షా, కాజీపేట, సికింద్రాబాద్, వికారాబాద్, కృష్ణా, రాయచూర్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ ఇచ్చారు.
  • కోచ్‌ల వివరాలు : ఈ రైలులో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

చర్లపల్లి - దానాపూర్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

రద్దీ దృష్ట్యా చర్లపల్లి - దానాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను మరో ట్రిప్పు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

  • రైలు నెం. 07051 (చర్లపల్లి - దానాపూర్): 2026 నవంబర్ 30న (సోమవారం) ఒక ట్రిప్పు నడుస్తుంది.
  • రైలు నెం. 07052 (దానాపూర్ - చర్లపల్లి): 2026 డిసెంబర్ 1న (మంగళవారం) ఒక ట్రిప్పు నడుస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks