Andhrapradesh : త్వరలో కాకినాడలో క్యాథ్ ల్యాబ్ సేవలు - మరో 3 చోట్ల కూడా ఏర్పాటు
త్వరలో కాకినాడలో క్యాథ్ ల్యాబ్ సేవలు ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళంలో కొత్త క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య సేవలను మరింత విస్తరిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ఆ దిశగా సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని చెప్పారు. గుండె జబ్బుల చికిత్స కోసం పేద ప్రజలు ఇతర ప్రాంతాలకు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఏటా సెప్టెంబరు 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2026లో ప్రపంచ హృదయ సమాఖ్య “డోంట్ మిస్ ఎ బీట్” అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గుండె జబ్బుల ముందస్తు సంకేతాలను గుర్తించడం, గుండెను సకాలంలో కాపాడుకోవడం, గుండె ఆరోగ్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరడమే ఈ ప్రచారంలోని ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2 కోట్ల మంది (20 మిలియన్లు) గుండె జబ్బుల బారిన పడి మరణిస్తుండటం కలవరపెడుతోంది. భారతదేశంలో సంభవిస్తున్న ప్రతి నాలుగు మరణాల్లో ఒకదానికంటే ఎక్కువ మరణాలకు గుండె సంబంధిత సమస్యలే ప్రధాన కారణమవుతున్నాయి. చాలామంది ఛాతినొప్పిని సాధారణ గ్యాస్ సమస్యగా భావించడం, ఆయాసాన్ని వయసు ప్రభావంగా సరిపెట్టుకోవడం, అకస్మాత్తుగా వచ్చే చెమటలు మరియు నీరసాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం వల్లే ముప్పు పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాకినాడలో ఆధునిక క్యాథ్‌ల్యాబ్…
కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రక్రియ కూడా పూర్తయిందని, అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ క్యాథ్‌ల్యాబ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా కాకినాడలో ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ భాగస్వామ్యంతో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక హార్ట్ సెంటర్ ఏర్పాటుకు కూడా చర్యలు వేగవంతం చేశామన్నారు.
మరో 3 చోట్ల కూడా….
తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.18 కోట్ల అంచనా వ్యయంతో నూతన క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 8 క్యాథ్‌ల్యాబ్‌లు పనిచేస్తుండగా, వీటిలో 5 ప్రభుత్వ నేరుగా నిర్వహిస్తుండగా, మరో 3 క్యాథ్‌ల్యాబ్‌లు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానంలో వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
తిరుపతి, కడప, అనంతపురం, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల కోసం కొత్తగా మరో 4 హార్ట్–లంగ్ మెషిన్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. ఇప్పటికే కర్నూల్, గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో హార్ట్–లంగ్ మెషిన్లు సేవలు అందిస్తుండగా… విశాఖపట్నం కేజీహెచ్‌లో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో హార్ట్–లంగ్ మెషిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

