థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీల్లో సినిమాలు అడుగుపెడుతుంటాయి. అయితే, ఈ ఓటీటీ రిలీజెస్ కొన్నిసార్లు అనౌన్స్‌మెంట్లతో, మంచి బజ్ క్రియేట్ చేస్తూ జరిగితే మరికొన్ని సార్లు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి.
సీరియస్ రోల్స్‌తో కూడా

అలా ఇవాళ (డిసెంబర్ 11) ఓటీటీలోకి సడెన్‌గా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే 12ఏ రైల్వే కాలనీ. కామెడీ సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అల్లరి నరేష్ సీరియస్ రోల్స్‌తో కూడా మెప్పించాడు. అయితే, గత కొంత కాలంగా అల్లరి నరేష్ సినిమాలు వర్కౌట్ కావట్లేదు.
హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా
నాంది తర్వాత అల్లరి నరేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతంగా సక్సెస్ కావట్లేదు. అందులో ఒక సినిమానే 12ఏ రైల్వే కాలనీ. తెలుగులో హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమాలో హీరోయిన్‌గా పొలిమేర బ్యూటి కామాక్షి భాస్కర్ల చేసింది. అలాగే, ఈ మూవీకి పొలిమేర చిత్రాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం.
12ఏ రైల్వే కాలనీ నటీనటులు
12ఏ రైల్వే కాలనీ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా రూపొందించిన 12ఏ రైల్వే కాలనీ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు సాయి కుమార్, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు కీలక పాత్రలు పోషించారు.
12ఏ రైల్వే కాలనీ రివ్యూస్
ట్రైలర్, టీజర్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలో నవంబర్ 21న విడుదలైంది. అయితే, ఊహించినంత స్థాయిలో సినిమాకు ఆదరణ దక్కలేదు. 12ఏ రైల్వే కాలనీ రివ్యూస్ మిక్స్‌డ్‌గా వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్‌గా 12ఏ రైల్వే కాలనీ నిలిచింది.
ఓటీటీలోకి సడెన్‌గా
{{/usCountry}}ట్రైలర్, టీజర్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలో నవంబర్ 21న విడుదలైంది. అయితే, ఊహించినంత స్థాయిలో సినిమాకు ఆదరణ దక్కలేదు. 12ఏ రైల్వే కాలనీ రివ్యూస్ మిక్స్‌డ్‌గా వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్‌గా 12ఏ రైల్వే కాలనీ నిలిచింది.
ఓటీటీలోకి సడెన్‌గా
{{/usCountry}}ఇలాంటి 12ఏ రైల్వే కాలనీ ఓటీటీలో ఇవాళ సడెన్‌గా ప్రత్యక్షమైంది. ఎలాంటి ప్రకనటన లేకుండా 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
తల్లీకూతురు హత్య నేపథ్యంలో
సుమారు 2 గంటల ఐదు నిమిషాల రన్‌టైమ్‌తో తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమా తల్లికూతురు జంట హత్యల నేపథ్యంలో సాగుతుంది. ఆ హత్య ఎవరు? ఎందుకు చేశారు? హీరోకు హీరోయిన్ దెయ్యమై ఎందుకు కనిపించింది? హీరో ఏం చేశాడు? జంట హత్యల కేసును ఎలా చేధించాడు? రాజకీయ అంశాలు ఎలా ముడిపడ్డాయి? వంటి ఎలిమెంట్స్‌తో 12ఏ రైల్వే కాలనీ మూవీ ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
హారర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, సస్పెన్స్, రొమాంటిక్, కామెడీ అంశాలతో తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమాను థియేటర్లలో చూడని వారు ఎంచక్కా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వీక్షించవచ్చు.